ETV Bharat / bharat

రాజ్యసభలో మరో ఎంపీపై వేటు- రూల్​ బుక్​ విసిరినందుకే..! - tmc leader derek obrein

Derek O'Brien suspended: రాజ్యసభలో ఎన్నికల చట్టాల(సవరణ) బిల్లుపై చర్చ సమయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. రాజ్యసభ 'రూల్​బుక్'​ను ఛైర్మన్ స్థానం వైపు విసిరిన నేపథ్యంలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రియన్​పై సస్పెన్షన్ వేటు పడింది.

Derek O'Brien suspended
డెరెక్ ఓబ్రెయిన్
author img

By

Published : Dec 21, 2021, 6:41 PM IST

Updated : Dec 21, 2021, 7:39 PM IST

Derek O'Brien suspended: రాజ్యసభలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రియన్​పై సస్పెన్షన్ వేటు పడింది. సభ నియమావళిని ఉల్లంఘించినందుకు ఆయన్ను ప్రస్తుత సెషన్​లోని మిగతా సమావేశాలకు హాజరు కాకుండా నిషేధం విధిస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు.

Rajya sabha rule book hurling: డెరెక్​ ఓబ్రియన్ పాయింట్ ఆఫ్ ఆర్డర్​ లేవనెత్తారని రాజ్యసభ ఛైర్మన్ స్థానంలో ఉన్న సుస్మితా పాత్ర తెలిపారు. దీనిపై రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్​ తగు విధంగా స్పందించారని చెప్పారు. ఆ కొద్దిసేపటికే.. రూల్​బుక్​ను ఛైర్మన్ సీటువైపునకు డెరెక్​ విసిరారని పేర్కొన్నారు. ఆ బుక్​ తనకు లేదా సెక్రటరీ జనరల్​ లేదా ఇతర అధికారులకు తగిలేదని చెప్పారు.

దీనికి సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించాక ఓబ్రియన్​ను సస్పెండ్ చేశారు. డిసెంబరు 23న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి.

Aadhaar Voter ID Link Bill: ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021ను రాజ్యసభ మంగళవారం ఆమోదించింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు బిల్లును సభలో ప్రవేశ పెట్టగా, రాజ్యసభ మూజువాజీ ఓటుతో ఆమోదించింది. అయితే.. బిల్లును ప్రవేశపెట్టే సమయంలో దీనిపై కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, వామపక్షాలు, డీఎంకే, ఎన్సీపీ డివిజన్‌కు పట్టుబట్టాయి. సెలక్ట్‌ కమిటీకి పంపించాలని తీర్మానాన్ని అందించాయి. ఈ తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో తిరస్కరించగా, నిరసనగా ఆయా పార్టీలు వాకౌట్‌ చేశాయి. అనంతరం బిల్లును సభ ఆమోదించింది. బిల్లుకు వైకాపా, జేడీ-యూ, అన్నాడీఎంకే, బీజేడీ మద్దతు తెలిపాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తర్వాత ఇది చట్టంగా మారనుంది. ఈ బిల్లును సోమవారమే లోక్‌సభ ఆమోదించింది.

ఇదీ చూడండి: టీఎంసీదే 'కోల్​కతా' పీఠం.. భాజపాపై దీదీ సెటైర్​!

ఇదీ చూడండి: 'ఓటర్‌ ఐడీ-ఆధార్‌ లింక్' బిల్లుకు రాజ్యసభ ఆమోదం- విపక్షాలు వాకౌట్​

Last Updated : Dec 21, 2021, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.