దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో.. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మరోసారి విజయ తీరాలకు చేరుతుందని టైమ్స్‌నౌ-సీ ఓటర్ ఒపీనియన్ పోల్ జోస్యం చెప్పింది. దీదీ పార్టీకి భాజపా గట్టి పోటీనిస్తుందని అంచనా వేసిన సర్వే.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థాయిలో మాత్రం సీట్లు సాధించబోదని అభిప్రాయపడింది. మొత్తం 294 సీట్లకు గానూ.. టీఎంసీ 152 నుంచి 168 స్థానాలను, భాజపా 104 నుంచి 120 సీట్లు గెలుచుకుంటుందని వెల్లడించింది. వామపక్షాలు-కాంగ్రెస్-ఐఎస్ఎఫ్కు 18 నుంచి 26 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
బంగాల్(294): టైమ్స్‌నౌ-సీ ఓటర్ సర్వే
పార్టీ/కూటమి | సీట్లు(అంచనా) |
తృణమూల్ కాంగ్రెస్ | 152-168 |
భాజపా | 104-120 |
వామపక్షాలు-కాంగ్రెస్-ఐఎస్ఎఫ్ | 18-26 |
ఇదీ చదవండి: 'బంగాలీ ఆత్మగౌరవం' దీదీని గెలిపించేనా?
ఇదీ చదవండి: బంగాల్‌లో భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిమనిషి
అసోంలో మరోసారి..
అసోంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ స్వల్ప తేడాతో నెగ్గి.. అధికారం నిలబెట్టుకుంటుందని సర్వే తేల్చింది. మొత్తం 126 స్థానాల్లో ఎన్డీఏకు 65 నుంచి 73 సీట్లు, కాంగ్రెస్ నాయకత్వంలోని మహాజోత్‌కు 52 నుంచి 60 సీట్లు వస్తాయని, ఇతరులు 4 స్థానాల్లో గెలుస్తారని వెల్లడించింది.
పార్టీ/కూటమి | సీట్లు(అంచనా) |
ఎన్డీఏ | 65-73 |
మహజోత్ | 52-60 |
ఇతరులు | 0-4 |
ఇదీ చదవండి: 'కాంగ్రెస్ వస్తే చొరబాట్లు, అవినీతి'
తమిళనాట ఇలా..
తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ కూటమి అధికారం కైవసం చేసుకుంటుందని టైమ్స్ నౌ-సీ ఓటరు సర్వేలో తేలింది. ఆ రాష్ట్రంలో పాగా వేయాలనుకున్న భాజపా కల నేరవేరే అవకాశం లేదని తెలిపింది. మొత్తం 234 స్థానాల్లో.. డీఎంకే-కాంగ్రెస్ కూటమికి 173 నుంచి 181 సీట్లు వస్తాయని పేర్కొంది. అన్నాడీఎంకే-భాజపా కూటమి 45 నుంచి 53 స్థానాలు మాత్రమే గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఈ ఎన్నికల్లో కమల్ హాసన్ ప్రభావం అంతగా ఉండదని తేల్చింది. ఆయన నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్ఎం) ఒకటి నుంచి ఐదు స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొంది. ఇతరులు రెండు సీట్లలో విజయం సాధిస్తారని అంచనా వేసింది.
పార్టీ/కూటమి | సీట్లు(అంచనా) |
డీఎంకే-కాంగ్రెస్ | 173-181 |
అన్నాడీఎంకే-భాజపా | 45-53 |
ఎంఎన్ఎం | 1-5 |
ఏఎంఎంకే | 1-5 |
ఇతరులు | 0-4 |
ఇదీ చదవండి: డీఎంకే వారసత్వ, ప్రజాస్వామ్య వ్యతిరేక పార్టీ: భాజపా
కేరళ 'ఎల్డీఎఫ్' కే..
కేరళలో వామపక్ష కూటమి ఎల్డీఎఫ్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని సర్వేలో వెల్లడైనట్టు తేలింది. మొత్తం 140 స్థానాల్లో.. 77 సీట్లను ఎల్డీఎఫ్ దక్కించుకుంటుందని తెలిపింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 62 చోట్ల గెలిచి.. గట్టి పోటి ఇవ్వనున్నట్లు పేర్కొంది.
పార్టీ/కూటమి | సీట్లు(అంచనా) |
ఎల్‌డీఎఫ్ | 77 |
యూడీఎఫ్ | 62 |
ఇదీ చదవండి: 25 ఏళ్ల తరువాత ఆ పార్టీ నుంచి మహిళా అభ్యర్థి
పుదుచ్చేరిలో ఎన్డీఏ..
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ విజయం సాధిస్తుందని ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. మొత్తం 30 స్థానాలకు.. 19 నుంచి 23 సీట్లు గెల్చుకుంటుందని పేర్కొంది. డీఎంకే-కాంగ్రెస్ కూటమి 7నుంచి 11 స్థానాల్లో విజయం సాధించనున్నట్లు తెలిపింది.
పార్టీ/కూటమి | సీట్లు(అంచనా) |
ఎన్డీఏ | 19-23 |
కాంగ్రెస్-డీఎంకే | 7-11 |
ఇదీ చదవండి: 'పుదుచ్చేరి మారుతుంది.. కమలం వికసిస్తుంది'
ఇదీ చదవండి: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిది?
ఇదీ చదవండి: 'ఇది దేశ ప్రతిష్ఠను దిగజార్చే ఘటన'