మధ్యప్రదేశ్లోని పెంచ్ జాతీయ పార్కులో పాద్దేవ్ అనే ఆడపులి ఇటీవల ఐదు పులి పిల్లలకు జన్మనిచ్చింది. శనివారం ఉదయం ఆ పులి తన పిల్లలతో కలిసి పార్కులో నడుస్తూ కనిపించింది. ఈ దృశ్యాలను ఓ పర్యటకుడు చిత్రీకరించాడు. సామాజిక మాధ్యమాల్లో అవి వైరల్గా మారాయి.

ఐదు పిల్లల్లో ఒకటి బలహీనం
పాద్దేవ్ పిల్లలు ఐదింటిలో ఒకటి అనారోగ్యంగా ఉందని సమాచారం. దీనిపై ఆ పాద్దేవ్ పులి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. మొదటి సారి ఒక ఆడపులి ఐదు పిల్లలకు జన్మనివ్వడం ఇదే తొలిసారి. 2010లో పాద్దేవ్ జన్మించింది.



మొత్తం ఎన్ని పులులు ఉన్నాయి.
మూడు సార్లు ప్రసవించిన ఈ పులి.. మొత్తం 10 పిల్లలకు జన్మనిచ్చిందని పెంచ్ పార్కు ఫీల్డ్ డైరెక్టర్ విక్రమ్ సింగ్ పరిహార్ తెలిపారు. 2018 లెక్కల ప్రకారం ఈ పార్కులో మొత్తం 55 పులులు(పెద్దవి) ఉన్నాయని తెలిపారు. చిన్నపిల్లలతో కలిపి వీటి సంఖ్య దాదాపు 80గా ఉంటుందని చెప్పారు.