సాధారణంగా పులులు, సింహాలు సరస్సులు, కొలనుల్లో జలకాలాడుతుంటాయి. కానీ.. ఓ పులి మాత్రం అచ్చం చిన్నపిల్లోడిలా టబ్‌లోకి దిగి స్నానం చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతోంది. కర్ణాటకలోని కొడుగులో ఓ ఇంటి యజమాని ఏదో అవసరం కోసం తోటలో నీటితొట్టి ఏర్పాటు చేసుకున్నాడు. అటుగా వచ్చిన ఓ పులి ఆ తొట్టి దగ్గరకు వచ్చింది. దాదాపు రెండు నిమిషాలు నిడివి ఉన్న ఈ వీడియోలో టబ్ చుట్టూ పులి తిరుగుతూ నిశితంగా పరిశీలించింది.
అనంతరం అందులోకి దిగి జలకాలాడింది. మళ్లీ ఎవరైనా వస్తే పారిపోవడానికి అనువుగా ముందు కాళ్లను బయటికే ఉంచి స్నానం చేసింది. ఈ వింత సంఘటనను కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు.
-
Spent most of my childhood holidays at our home in Kodagu, just six miles from Nagarhole game sanctuary. NEVER lucky enough to see a tiger. And this chap comes to someone’s home to use their ‘bathtub.’ Magnificent. When a Tiger uses a Jacuzzi it becomes a ‘Ticuzzi’ https://t.co/OjixxCEXJ2
— anand mahindra (@anandmahindra) December 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Spent most of my childhood holidays at our home in Kodagu, just six miles from Nagarhole game sanctuary. NEVER lucky enough to see a tiger. And this chap comes to someone’s home to use their ‘bathtub.’ Magnificent. When a Tiger uses a Jacuzzi it becomes a ‘Ticuzzi’ https://t.co/OjixxCEXJ2
— anand mahindra (@anandmahindra) December 10, 2020Spent most of my childhood holidays at our home in Kodagu, just six miles from Nagarhole game sanctuary. NEVER lucky enough to see a tiger. And this chap comes to someone’s home to use their ‘bathtub.’ Magnificent. When a Tiger uses a Jacuzzi it becomes a ‘Ticuzzi’ https://t.co/OjixxCEXJ2
— anand mahindra (@anandmahindra) December 10, 2020
దీన్ని చూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సైతం తెగ సంబరపడ్డారు. పైగా ఈవీడియోనూ రీట్వీట్ చేస్తూ.. 'పులి ఇలా చేయడం తాను ఇదివరకెప్పుడూ చూడలేదన్నారు. ఈ సందర్భంగా ఆయన.. కర్ణాటకలోని కొడుగులో గడిపిన తన చిన్ననాటి రోజులను'గుర్తు చేసుకున్నారు.
ఇదీ చూడండి:సింహాలను తరిమారు.. అటవీ అధికారులకు చిక్కారు