ETV Bharat / bharat

తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు అసమంజసం.. సీబీఐకి నిబంధనలు పెట్టడం సరికాదు : సుప్రీం - Telangana High Court

సుప్రీం కోర్టులో విచారణ
సుప్రీం కోర్టులో విచారణ
author img

By

Published : Apr 24, 2023, 3:40 PM IST

Updated : Apr 24, 2023, 5:27 PM IST

15:25 April 24

వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు రెండు నెలలు పొడిగింపు

Supreme court : వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం నిలిపేసింది. హైకోర్టు ఉత్తర్వులను పూర్తిగా పక్కన పెట్టిన సుప్రీంకోర్టు.. అలాంటి ఉత్తర్వులు సీబీఐ దర్యాప్తుపై ప్రభావం చూపుతాయని వ్యాఖ్యానించింది. నిందితులకు లిఖిత పూర్వక ప్రశ్నలు ఇవ్వాలనడం అసమంజసమని పేర్కొంటూనే.. సీబీఐకి నిబంధనలు విధించడం సరైన చర్య కాదని సుప్రీం స్పష్టం చేసింది. సీబీఐ సిట్ ఏర్పాటు సందర్భంగా ఏప్రిల్ 30లోగా కేసు దర్యాప్తు పూర్తి చేయాలన్న సుప్రీం కోర్టు.. తాజా పరిణామాల నేపథ్యంలో సీబీఐకి మరో రెండు నెలల గడువు ఇచ్చింది.

సుప్రీంలో సవాల్ చేసిన సునీత... కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఈ నెల 24 వరకు అరెస్టు చేయొద్దన్న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ... వైఎస్ వివేకా కూతురు సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సునీత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా సునీత తరఫున, ముకుల్‌ రోహత్గీ అవినాష్‌ రెడ్డి తరఫున వాదించారు.

బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకోవాలి... 'అందరి వాదనలు విన్నాం.. అఫిడవిట్లు, రిమాండ్‌ రిపోర్టులను పరిశీలించాం..' అన్న సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ తెలంగాణ హైకోర్టులో అఫిడ‌విట్‌ను అవినాష్‌ ఉపసంహరించుకోవాలని, ముందస్తు బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. హత్య కేసులుసాక్ష్యాల‌ను నాశ‌నం చేసేందుకు అవినాష్‌ రెడ్డి యత్నించాడని ఈ సందర్భంగా సునీత తరఫు న్యాయవాది వాదించారు. సీఐ శంక‌ర‌య్య త‌న వాంగ్మూలంలో అదే చెప్పారన్న న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. అవినాష్‌కు ప్రశ్నలు ముందే ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు చెప్పిందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ హైకోర్టు ఇలా చెప్పడం గతంలో ఎప్పుడూ లేదని వెల్లడించారు. దీనిని ఖండించిన అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను త‌ప్పుగా అర్థం చేసుకున్నార‌ని పేర్కొన్నారు.

సీబీఐ పని హైకోర్టు చేస్తే ఎలా.. వాదనలు ముగిసిన అనంతరం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి.. ఆర్డర్ కాపీని చదివారు. హత్య కేసులో అవినాష్‌ పాత్ర ఉందని సీబీఐ స్పష్టంగా చెప్పిందన్న సీజేఐ.. విచారణ ఇంకా ప్రాథమిక దశలో ఉన్న కేసుపై హైకోర్టు ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు. సీబీఐ పని కూడా తెలంగాణ హైకోర్టు చేస్తే ఎలా? అని సీజేఐ చంద్రచూడ్‌ పేర్కొన్నారు. నిందితులకు లిఖితపూర్వక ప్రశ్నలు ఇవ్వాలనడం అసమంజసమని.. ఈ ఆదేశాలు సీబీఐ దర్యాప్తుపై ప్రభావం చూపుతాయని స్పష్టం చేశారు. కాగా, ఈ కేసుపై రేపు హైకోర్టులో విచారణ ఉందని తెలిపిన అవినాష్‌ తరఫు న్యాయవాదులు, అప్పటి వరకు ఆయన్ను అరెస్టు చేయవద్దని కోరారు. అయితే, అలాంటి ఆదేశాలను ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు.. మీ విజ్ఞప్తిని మన్నిస్తే ఉత్తర్వులు పరస్పరం విరుద్ధంగా ఉంటాయని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి :

Last Updated : Apr 24, 2023, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.