ETV Bharat / bharat

tension in Vinukonda: వినుకొండలో 144 సెక్షన్.. ఉద్రిక్తతకు దారితీసిన ఎమ్మెల్యే వైఖరి... టీడీపీ వైసీపీ ఘర్షణలో పలువురికి గాయాలు

author img

By

Published : Jul 27, 2023, 12:59 PM IST

Updated : Jul 27, 2023, 6:00 PM IST

వినుకొండలో టీడీపీ ర్యాలీ
వినుకొండలో టీడీపీ ర్యాలీ

12:56 July 27

మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుపై అక్రమ కేసు ఎత్తేయాలని టీడీపీ ర్యాలీ

వినుకొండలో టీడీపీ ర్యాలీ ఉద్రిక్తత

tension in Palnadu district Vinukonda: పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపే వరకూ వెళ్లింది. వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఈ గొడవలకు కేంద్ర బిందువుగా నిలిచారు. ఘర్షణ వాతావరణాన్ని నియంత్రించటంలో విఫలమైన పోలీసులు... టీడీపీ శ్రేణులపైనే లాఠీఛార్జీ చేయటం విమర్శలకు తావిచ్చింది. ఈ గొడవల్లో ఐదుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలు బయటపెడుతున్నందునే తనపై అక్రమ కేసులు పెట్టడంతో పాటు కార్యకర్తలపై దాడి చేశారని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు.

కవ్వింపు చర్యలకు పాల్పడిన ఎమ్మెల్యే.. పోలీసులు ఉదాసీనంగా ఉంటే చిన్న వివాదం కూడా ఎంత పెద్దగా మారుతుందనేందుకు పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన ఘటనే నిదర్శనం. స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు చెందిన వల్లభ డెయిరీకి చెందిన స్థలాల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మూడు రోజుల క్రితం ఆందోళన నిర్వహించారు. తన భూముల్లోకి జీవీ ఆంజనేయులు రావటంపై బొల్లా బ్రహ్మనాయుడు కేసు పెట్టించారు. అయితే పోలీసులు అక్రమ కేసులు పెట్టారంటూ టీడీపీ శ్రేణులు ఇవాళ వినుకొండలో నిరసన ర్యాలీ నిర్వహించాయి. ర్యాలీ వినుకొండ ఆర్టీసి బస్టాండ్ వద్దకు రాగానే ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎదురయ్యారు. ఆయన వాహనానికి టీడీపీ శ్రేణులు దారి ఇచ్చినా వెళ్లకుండా వాహనం దిగి ఎమ్మెల్యే సవాళ్లకు పాల్పడ్డారు. మట్టి తవ్వకాలపై చర్చకు సిద్ధంగా ఉన్నానని, దమ్మున్న మొనగాడెవరో రావాలని సవాల్ చేశారు. ఎమ్మెల్యే వాహనం వెళ్లటానికి టీడీపీ శ్రేణులు దారి ఇచ్చినా వెళ్లకుండా కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఎమ్మెల్యే అక్కడే ఉండి వైసీపీ కార్యకర్తల్ని పిలిపించారు. వారంతా కార్యకర్తలు రాళ్లు, కర్రలు, సోడా సీసాలతో తరలివచ్చి టీడీపీ శ్రేణులపై దాడికి తెగబడ్డారు. పోలీసులు చెప్పినా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అక్కడి నుంచి వెళ్లిపోలేదు. దాదాపు 2గంటల పాటు రోడ్డుపై ఉండి ఘర్షణను మరింత ప్రేరేపించారు.

కాల్పులు జరిపిన సీఐ.. ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ.. టీడీపీ శ్రేణులు వ్యతిరేక నినాదాలు చేశారు. ఎమ్మెల్యే కారును ముట్టడించారు. పోలీసులు వారిని చెదరగొట్టడానికి లాఠీఛార్జీ చేశారు. వినుకొండ పట్టణ సీఐ సాంబశివరావు ఒక రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపారు. తన వాహనంపైకి ఎక్కి పిస్టల్ చూపిస్తూ ఇరు వర్గాలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్ఛరించారు. ఓవైపు పోలీసుల లాఠీఛార్జి, మరోవైపు వైసీపీ శ్రేణుల దాడితో టీడీపీ శ్రేణులు చెల్లాచెదురైపోయారు. ఐదుగురు టీడీపీ కార్యకర్తలు ఈ ఘర్షణలో గాయపడ్డారు. వారికి సమీప ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని టీడీపీ వర్గాలు ఆరోపించాయి. రెచ్చగొట్టేలా మాట్లాడి దాడి చేయించారని, పోలీసులతో కొట్టించారని గాయపడిన బాధితులు తెలిపారు.

ఎమ్మెల్యేపై విమర్శలు.. ఘర్షణలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యే వైఖరి కారణంగానే వినుకొండలో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపే వరకూ పరిస్థితి వెళ్లింది. టీడీపీ నిరసన ర్యాలీ ఉందని తెలిసినా ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అటువైపు వచ్చారు. వాహనం ఆపి సవాల్ విసిరారు. రెండు నెలల క్రితం శావల్యపురంలో కూడా ఇదే విధంగా టీడీపీ ర్యాలీకి ఎదురొచ్చిన ఎమ్మెల్యే... పార్టీ కార్యకర్తల్ని చూసి మీసం తిప్పారు. దీనిపై టీడీపీ కార్యకర్తలు గొడవకు దిగటంతో వారిపై కేసులు పెట్టించారు. ఇప్పుడు వినుకొండలో కూడా ర్యాలీకి అడ్డుగా వచ్చి కవ్వింపు చర్యలకు దిగారు. త్వరలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర పల్నాడు జిల్లాలో ప్రవేశించనుంది. వినుకొండ నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ తరుణంలో తెలుగుదేశం శ్రేణుల్ని రెచ్చగొట్టి కేసులు పెట్టించటం, దాడి చేసి భయబ్రాంతులకు గురిచేయటం ఎమ్మెల్యే ఉద్దేశమని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు.

ఘర్షణల అనంతరం పోలీసులు వినుకొండలో 144సెక్షన్ విధించారు. మూడు రోజుల పాటు పోలీసు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. గొడవలకు సంబంధించి ఇరు వర్గాలపై కేసులు నమోదు చేయనున్నట్లు సమాచారం.

Last Updated : Jul 27, 2023, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.