పంజాబ్ జలంధర్లో దారుణం జరిగింది. అత్తింటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ వ్యక్తి. ఈ ఘటనలో భార్యాపిల్లలు, అత్తామామలు సజీవ దహనమయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ జరిగింది
పరమ్జీత్ కౌర్ అనే మహిళ మెహతాపుర్ సమీపంలోని మద్దేపుర్ గ్రామంలో నివసిస్తోంది. పేద కుటుంబానికి చెందిన పరమ్జీత్ కౌర్.. మొదట పెళ్లి చేసుకోగా.. ఇద్దరు పిల్లలు జన్మించారు. అనంతరం భర్త చనిపోవడం వల్ల ఖుర్సైద్పురకు చెందిన ఖాలోతో రెండో వివాహం చేశారు. మొదట్లో బాగానే ఉన్న ఖాలో.. కొన్ని రోజుల తర్వాత భార్యను వేధించడం మొదలుపెట్టాడు. పిల్లలను విడిచిపెట్టాలని చెప్పేవాడు. దీనికి కౌర్ ఒప్పుకోకపోవడం వల్ల తీవ్రంగా కొట్టేవాడు.
అతడి వేధింపులకు తాళలేక పిల్లలను వెంటబెట్టుకుని పుట్టింటికి వచ్చింది. ఎంత చెప్పినా భార్య మాట వినడం లేదని ఆగ్రహించిన ఖాలో.. అతడి స్నేహితులతో కలిసి మద్దేపుర్లోని అత్తింటికి వచ్చాడు. ఎవరూ బయటకు రాకుండా ఇంటి తలుపులు మూసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడి నుంచి వారంతా పరారయ్యారు. ఈ ప్రమాదంలో పరమ్జీత్ కౌర్, ఆమె తండ్రి సుర్జన్ సింగ్, తల్లి జోగింద్రో దేవి, పిల్లలు గల్మోహర్, అర్ష్దీప్ సజీవ దహనమయ్యారు.
ఇవీ చదవండి: బరువు తగ్గి రూ.2,300 కోట్లు రాబట్టిన ఎంపీ
ఫోన్ కొట్టేశాడన్న అనుమానంతో బాలుడ్ని నూతిలో వేలాడదీసి విచారణ