ETV Bharat / bharat

ఫిబ్రవరి తొలి వారంలోనే కాంగ్రెస్​కు కొత్త సారథి

కాంగ్రెస్​ పార్టీకి కొత్త సారథి నియామకం ఫిబ్రవరిలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై పార్టీ కసరత్తులు ప్రారంభించింది. రెండు మూడు రోజుల్లోనే పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి(సీడబ్ల్యూసీ) భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

author img

By

Published : Jan 5, 2021, 4:01 PM IST

కాంగ్రెస్‌ అధ్యక్ష మార్పు వ్యవహారంపై పార్టీ కసరత్తు ప్రారంభించింది. దీనిపై.. ఒకటి రెండు రోజుల్లోనే పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి(సీడబ్ల్యూసీ) భేటీ కానున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

గత నెలలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో నాయకత్వ మార్పే కీలకంగా చర్చ జరిగింది. ముఖ్యంగా సీనియర్​ నేత రాహుల్​ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలని పలువురు సీనియర్​ నేతలు పట్టుబట్టారు. ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆలోచించాలని నేతలు కోరారు. స్పందించిన రాహుల్​.. పార్టీ ఏ పదవి ఇచ్చినా చేపట్టేందుకు సిద్ధమేనని అప్పుడే స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలోనే అధ్యక్ష మార్పు విషయంలో అనుసరించాల్సిన విధానాన్ని పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ఖరారు చేసింది. ఏఐసీసీ సభ్యులుగా ఎన్నికైన వారంతా.. అధ్యక్ష అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఫిబ్రవరి తొలి వారంలోనే..

ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం.. కొత్త సభ్యులందరికీ తాజాగా తయారు చేసిన గుర్తింపు కార్డులను సిద్ధం చేస్తోంది. దేశంలో సుమారు 2 వేల మంది ఏఐసీసీ సభ్యులు ఉన్నట్లు వెల్లడించింది. ఒకటి రెండు రోజుల్లో జరిగే ఈ సీడబ్ల్యూసీ భేటీలో పార్టీ అద్యక్ష ఎన్నిక షెడ్యూల్‌ను ఖరారు చేయనుంది.

అధ్యక్ష ఎన్నికల తర్వాత జరిగే పార్టీ ప్లీనరీలో.. కొత్తగా ఎన్నికైన సారథి బాధ్యతలు చేపట్టనున్నారు. మొత్తం ఫిబ్రవరి తొలి వారం కల్లా ప్రక్రియను పూర్తి చేయాలని కాంగ్రెస్​ యోచిస్తోంది.

ఇదీ చూడండి: పార్టీ అధ్యక్షుడిగా మీరే ఉండండి: సీడబ్ల్యూసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.