Telangana Election Fight in Nalgonda Constituency : నల్గొండ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 16 సార్లు ఎన్నికలు జరగగా.. అత్యధికంగా ఏడుసార్లు కాంగ్రెస్, మూడుసార్లు తెలుగుదేశం, రెండుసార్లు పీడీఎఫ్ గెలిచాయి. సీపీఎం, సీపీఐ, బీఆర్ఎస్(టీఆర్ఎస్), ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒక్కోసారి గెలిచారు. నల్గొండ నుంచి కాంగ్రెస్ తరఫున కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హ్యాట్రిక్ సహా వరుసగా నాలుగుసార్లు గెలిచారు. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు సైతం 1985లో నల్గొండ(Nalgonda Fight) నుంచి పోటీచేసి విజయం సాధించారు.
తెలుగుదేశం నేతగా ఉన్న కంచర్ల భూపాల్ రెడ్డి.. 2014లో పార్టీ టికెట్ దక్కక స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతిలో 10 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి వెంకట్‌రెడ్డిపై 23 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండా(BRS) ఎగురవేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని రెండుసార్లు చుట్టేసిన ఆయన.. నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో సమన్వయలోపం.. ప్రజలతో మమేకం కాలేకపోవడం, సంక్షేమ పథకాల కేటాయింపులో వివక్ష చూపారనే ఆరోపణలు కంచర్లకు ప్రతికూలాంశాలు.
"అవసరాలు తీర్చడం కోసం ముఖ్యమంత్రి గారు రూ.1350 కోట్ల ఇచ్చి అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయి. ఈ పనులను ప్రజలంతా చూస్తున్నారు. ఈ రోజు నల్గొండ ఈ విధంగా మారుతా ఉంటే వారు చాలా సంతోషంగా ఉన్నారు. వారి ఇంటికి వెళ్లేటప్పుడు కుంకుమ తిలకం దిద్ది స్వాగతం పలుకుతూ ఉన్నారు." -కంచర్ల భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి
Nagarjuna sagar Political War 2023 : సాగర్‌లో.. వారసుల వార్.. గెలుపు వరించేది ఎవరినో..?
Komati Reddy Venkata Reddy is Congress Candidate in Nalgonda : కాంగ్రెస్‌కు రెండు దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న నల్గొండ.. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కీలకంగా మారింది. పట్నం నుంచి ప్రతి పల్లె దాకా.. పేరు పెట్టి పిలవగలిగేంత చనువు, ఆదరణ ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశం. మాస్ ఇమేజ్ కలిగిన కోమటిరెడ్డి(Komatireddy Venkatreddy).. ఆరోసారి బరిలోకి దిగి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మెకు మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేసి.. ఆమరణ దీక్షకు దిగిన చరిత్ర ఆయన సొంతం. గులాబీ పార్టీలో రెండో శ్రేణి నాయకుల మధ్య అనైక్యతే కోమటిరెడ్డికి బలంగా మారనుందన్న ప్రచారం సాగుతోంది. గతంలో అధికారపార్టీలోకి వెళ్లినవారంతా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోవడం వెంకటరెడ్డికి లాభించే అంశాలు.
"స్వచ్ఛందంగా వాళ్లే వచ్చి హారతి ఇస్తున్నారు. ఎందుకు తిరుగుతున్నావు నీవు నిన్ను తిరగకుండానే గెలిపిస్తాము అంటున్నారు ప్రజలు. మళ్లీ ప్రశాంతమైన నల్గొండ కావాలని.. నిన్ను గెలిస్తామని మాట ఇస్తున్నారు. ఎంపీలా ఉన్నా కూడా నా నల్గొండను వదిలిపెట్టలేదు. ఆపదలో ఆదుకుంటూ వస్తున్నా." -కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి
BJP Candidate Srinivas Goude in Election Campaign : కాంగ్రెస్, బీఆర్ఎస్ మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. బీసీ నినాదంతో నిశ్శబ్ద ఓటింగ్ జరగడం ఖాయమని ధీమాతో కమలం అభ్యర్థి ఉన్నారు. నల్గొండలో ఈసారి పాగా వేసేది ఎవరనే అంశం రాజకీయ విశ్లేషకులకు సైతం అంతుపట్టకుండా ఉంది.
ఇందిరమ్మపై హాస్యాస్పద వ్యాఖ్యలా అంటూ కేసీఆర్‌పై ఖర్గే ఫైర్
'తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 100 స్థానాల్లో విజయదుందుభి మోగిస్తాం'