TS EAMCET Results 2023 : తెలంగాణలో ఎంసెట్ పరీక్ష ఫలితాలను ఈ నెల 25న విద్యాశాఖ విడుదల చేయనుంది. ఆ రోజు ఉదయం 11 గంటలకి ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://eamcet.tsche.ac.in/ లో విద్యామండలి ప్రకటించనుంది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి ర్యాంకులు చెక్ చేసుకోవచ్చు. ఫలితాల తర్వాత విడతల వారీగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అభ్యర్థికి వచ్చిన ర్యాంకు, కోర్సు, కళాశాల, అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా అడ్మిషన్ కేటాయిస్తారు. సీటు కేటాయించిన తర్వాత.. సదరు అభ్యర్థి సంబంధిత కాలేజీకి వెళ్లి రిపోర్ట్ చేయాలి.
ఎప్పుడు పరీక్షను నిర్వహించారు : తెలంగాణలో ఫిబ్రవరి నెల 28న ఎంసెట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 3 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించింది. దీనికి చివరి తేదీ ఏప్రిల్ 10 వరకు గడువు ఇచ్చింది. మార్చి 30 తేదీన పరీక్ష రాసే అభ్యర్థులకు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునే సౌలభ్యం కల్పించింది. మే 10 నుంచి 14 వరకు ఈ పరీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించిన కీను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 16వ తేదీ వరకు కీలో తప్పులు ఉంటే సరిదిద్దేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు వారి రెస్పాన్స్ షీట్‌ను డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది.
ఎంత మంది ఈ ఎగ్జామ్‌ని రాశారు : ఈ సంవత్సరం టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్‌కి గత సంవత్సరం కంటే అధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఇంజినీరింగ్ విభాగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంజనీరింగ్ పరీక్షకు 2,05,405 మంది దరఖాస్తు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంజనీరింగ్ పరీక్షకు 2,05,405 మంది దరఖాస్తు చేశారు. అగ్రికల్చర్, మెడికల్ ఎంసెట్ పరీక్షలకు 1,15,361 మంది విద్యార్థులు అప్లై చేశారు. మొత్తంగా ఈ పరీక్షకు 94.11 శాతం విద్యార్థులు హాజరయ్యారు. జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఈ పరీక్షలను నిర్వహించింది.
ఇంటర్ మార్కుల వెయిటేజ్ లేదు : గతంలో ఇంటర్ మార్కులకు ఎంసెట్‌లో ప్రభుత్వం వెయిటేజీ ఇచ్చింది. ఈ సంవత్సరం నుంచి ఇంటర్ మార్కుల వెయిటేజీ నిబంధనను తొలగించింది. ఎంసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ర్యాంక్ ఇస్తారు. స్థానికత కలిగిన అభ్యర్థుల కోసం రాష్ట్ర కోటా కింద 85 శాతం సీట్లు రిజర్వ్ చేశారు. వారికి ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం ఉంటుంది. మిగిలిన 15 శాతం సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించారు. రాష్ట్రంలో ఎంసెట్ రాసే విద్యార్థులు.. 9,10 తరగతులు, ఇంటర్ రెండేళ్లు రాష్ట్రంలోనే చదివి ఉండాలి. అప్పుడే వారిని లోకల్‌గా గుర్తిస్తారు.
ఇవీ చదవండి: