ETV Bharat / bharat

ధరణి స్థానంలో మీ భూమి, వరికి రూ.3100 మద్దతు ధర - 'మన మోదీ గ్యారంటీ - బీజేపీ భరోసా' పేరుతో మేనిఫెస్టో విడుదల - mana modi guarantee bjp bharosa

bjp manifesto 2023
telangana bjp manifesto 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2023, 7:22 PM IST

Updated : Nov 18, 2023, 7:47 PM IST

17:56 November 18

ధరణి స్థానంలో మీ భూమి, వరికి రూ.3100 మద్దతు ధర - 'మన మోదీ గ్యారంటీ - బీజేపీ భరోసా' పేరుతో మేనిఫెస్టో విడుదల

Telangana BJP Manifesto 2023 : తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. మోదీ గ్యారంటీ - బీజేపీ భరోసా పేరుతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​ షా ఆ పార్టీ ఎన్నికల ప్రణాళికను ప్రకటించారు. రాష్ట్రంలో ధరణి స్థానంలో మీ భూమి యాప్​, వరికి రూ.3100 మద్దతు ధర సహా డిగ్రీ కాలేజీలు, ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే విద్యార్థినులకు ఉచిత ల్యాప్​టాప్​లు అందజేస్తామని అందులో పేర్కొన్నారు. పూర్తి మేనిఫెస్టో ఇలా..

1. ప్రజలందరికీ సుపరిపాలన.. సమర్థవంతమైన పాలనపై దృష్టి

  • అవీనితిని ఉక్కుపాదంతో అణచివేయడంతో పాటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్' నినాదంతో సుపరిపాలన
  • ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నట్లుగానే పెట్రోల్, డీజిల్​పై వ్యాట్​ను తగ్గించడం ద్వారా పెట్రో ఉత్పత్తుల ధరల తగ్గింపు
  • ధరణి వ్యవస్థ స్థానంలో పారదర్శకమైన 'మీ భూమి' వ్యవస్థ
  • కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం ప్రత్యేక నోడల్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు
  • తెలంగాణ గల్ఫ్ నివాసితుల సంక్షేమం కోసం ప్రత్యేక నోడల్ విభాగం ఏర్పాటు
  • ఉద్యోగస్థులు, పింఛనర్లకు ప్రతి నెలా 1వ తేదీనే వేతనాలు
  • బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో చేసిన కుంభకోణాలన్నింటిపై విచారణ కమిటీ ఏర్పాటు

2. వెనుకబడిన వర్గాల సాధికారత - అందరికీ చట్టం సమానంగా వర్తింపు

  • రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ, అందరికీ సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి బాటలు
  • బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా
  • రాజ్యాంగానికి విరుద్ధంగా.. మత ప్రతిపాదికన ఇచ్చిన రిజర్వేషన్లను తొలగించి వాటిని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వర్తింపు
  • వివిధ చట్టాలను ఏకీకృతం, సమన్వయం చేసి ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదాను రూపొందించే కమిటీ ఏర్పాటు
  • ఎస్సీల్లోని అత్యంత వెనుకబడిన వర్గాలకు సాధికారతను కల్పించేలా ఎస్సీ వర్గీకరణ చేయడంలో మా వంతు సహకారం

3. కూడు-గూడు: ఆహార, నివాస భద్రత

  • రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కొత్త ఇళ్ల నిర్మాణం. తద్వారా అందరికీ ఇల్లు ఉండేలా చూస్తాం. ఇంటి పట్టాలు అందజేస్తాం.
  • అర్హత కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్​ కార్డులు
  • సమయానుగుణంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా.. నాణ్యమైన రేషన్​ ప్రజలకు అందించే పారదర్శక వ్యవస్థ అందుబాటులోకి

4. రైతే రాజు - అన్నదాతకు అందలం

  • రాష్ట్రంలోని రైతుల ఎరువుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఎరువుల సబ్సిడీ (ఎకరానికి రూ.18వేలు)తో పాటుగా
  • *చిన్న, సన్నకారు రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు రూ.2,500 ఇన్పుట్ అసిస్టెన్స్
  • ప్రధానమంత్రి పంట బీమా పథకం ద్వారా రైతులకు ఉచిత పంట బీమా
  • వరికి రూ.3100 మద్దతు ధర
  • పసుపు కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు
  • ఆసక్తి గల రైతులకు దేశీ ఆవులను ఉచితంగా అందజేత
  • ప్రధానమంత్రి ప్రకటించిన జాతీయ పసుపు బోర్డు నిర్ణయానికి అనుగుణంగా *నిజామాబాద్ టర్మరిక్ సిటీ డెవలప్​మెంట్

5. నారీశక్తి- మహిళల నేతృత్వంలో అభివృద్ధి

  • డిగ్రీ కాలేజీలు, ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే విద్యార్థినులకు ఉచిత ల్యాప్​టాప్​లు
  • ఆడబిడ్డ భరోసా (నవజాత బాలిక): ఆడబిడ్డ భరోసా పేరుతో.. నవజాత బాలికపై ఫిక్స్​డ్​ డిపాజిట్
  • ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్లు
  • స్వయం సహాయక బృందాలకు నామమాత్రపు 1% వడ్డీకే రుణాలు*
  • మహిళా రైతులకు మద్దతు, సహకారం అందించేందుకు *మహిళ రైతు కార్పొరేషన్* ఏర్పాటు
  • ఇళ్లలో పనిచేసే మహిళలకు నైపుణ్య శిక్షణ, సామాజిక భద్రత అందించేందుకు *డొమెస్టిక్ వర్కర్స్ కార్పొరేషన్* ఏర్పాటు
  • మహిళలకు 10 లక్షల ఉద్యోగాల కల్పన

Last Updated : Nov 18, 2023, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.