ఝార్ఖండ్ జంషెద్పుర్లో అమానవీయ ఘటన జరిగింది. పరీక్షల్లో కాపీ కొడుతోందని అనుమానించిన ఓ మహిళ టీచర్ బాలిక బట్టలు విప్పించింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన బాలిక ఇంటికి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఒంటిపై ఆయిల్ పోసుకుని నిప్పంటించుకుంది. దాదాపు 80 శాతం కాలిన గాయాలతో ఉన్న బాలికను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అనంతరం బాలిక పరిస్థితి విషమించడం వల్ల టాటా ఆస్పత్రికి తీసుకెళ్లారు.
బాధితురాలు.. ఛాయనగర్లోని స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. శుక్రవారం మధ్యాహ్నం బాలిక పరీక్ష రాయడానికి పాఠశాలకు వెళ్లింది. ఈ సమయంలో బాలిక కాపీ కొడుతుందని చంద్ర అనే టీచర్ అనుమానించింది. ఈ క్రమంలో బాలికను మరో గదిలోకి తీసుకెళ్లి బట్టలు విప్పి తనిఖీ చేసింది. దీంతో బాలిక మనస్తాపానికి గురై.. సాయంత్రం ఇంటికి వెళ్లి ఒంటిపై ఆయిల్ పోసుకుని నిప్పంటించుకుంది. మహిళా ఉపాధ్యాయురాలు వల్లే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని బాధితురాలు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై గ్రామస్థులు మండిపడుతున్నారు.
ఇవీ చదవండి: 'నేను బతికున్నంత వరకు భాజపాతో పొత్తు పెట్టుకోను'
కుమార్తె మర్డర్.. తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య.. తల్లికి క్యాన్సర్.. ప్రేమ హత్య కేసులో విషాదం