ETV Bharat / bharat

గిన్నెను తాకిందని దళిత దివ్యాంగురాలిపై వేడి నీరు పోసిన టీచర్​ - యూపీ న్యూస్

Teacher Beats Student : ఆహారం వడ్డించే పాత్రకు చేయి తగిలిందని.. గిరిజన వర్గానికి చెందిన బాలికను కులం పేరుతో దూషించి.. తీవ్రంగా కొట్టాడు ప్రధానోపాధ్యాయుడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ బారాబంకిలో జరిగింది. గిరిజన బాలికను ఎత్తుకెళ్లి ఐదురోజుల పాటు అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్​లోని రెవాలో జరిగింది.

teacher beats up student
teacher beats up student
author img

By

Published : Sep 13, 2022, 7:41 PM IST

Teacher Beats Student : ఆహారం వడ్డించే పాత్రకు చేయి తగిలిందని.. దళిత బాలికను కులం పేరుతో దూషించి.. తీవ్రంగా కొట్టాడు ప్రధానోపాధ్యాయుడు. దివ్యాంగ బాలిక అని చూడకుండా వేడి నీటిని ఆమెపై పోశాడు. ఇదేంటని అడగడానికి వచ్చిన బాలిక తండ్రిని సైతం కులం పేరుతో దూషించాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బారాబంకిలో జరిగింది.

టికైత్​నగర్​ పోలీస్ స్టేషన్​ పరిధిలోని ఇచౌలి గ్రామానికి చెందిన దివ్యాంగ బాలిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. రోజు లాగానే ఆగస్టు 29న బాలికను పాఠశాలకు వెళ్లింది. మధ్యాహ్నం భోజనం చేసేందుకు వెళ్లగా.. ఆహరం వడ్డించే పాత్రకు చేయి తగిలింది. దీంతో ఆగ్రహానికి గురైన ప్రధానోపాధ్యాయుడు మహ్మద్​ అమీన్​ కులం పేరుతో దూషించాడు. దాంతో ఆగకుండా వేడి నీరును బాలికపై పోశాడు. చేయి కాలిన బాలిక ఏడుస్తూ వెళ్లి తండ్రికి చెప్పింది. బాలిక తండ్రి అనంతరం పాఠశాలకు రాగా.. అతడిని సైతం కులం పేరుతో దూషించాడు ప్రధానోపాధ్యాయుడు. దీంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు బాలిక తండ్రి. దీనిపై విచారించిన విద్యాశాఖ అధికారులు.. ప్రధానోపాధ్యాయుడిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అతడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పాఠశాల విద్యార్థినికి వేధింపులు.. : పాఠశాలకు వెళ్తున్న విద్యార్థిని వేధిస్తున్న ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బరేలీలో జరిగింది. పదో తరగతి చదువుతున్న బాలికను వెంబడిస్తూ వేధిస్తున్నాడు ఓ ఆకతాయి. ఆకతాయి వేధింపులు తాళలేక చదువును సైతం మధ్యలోనే నిలిపివేసింది బాలిక. పోలీసులుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

రహైయా నాగ్లా గ్రామానికి చెందిన బాలిక స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువతోంది. ఆమె రోజు పాఠశాలకు వెళ్లి వస్తుండగా వేధిస్తున్నాడు ఓ ఆకతాయి. అతడి వేధింపులకు తాళలేక పాఠశాలకు వెళ్లడం మానేసింది. అయినా వేధింపులు ఆపని యువకుడు వాట్సాప్​, ఫేస్​బుక్​లో బాలిక చిత్రాలను పోస్ట్ చేసి వేధిస్తున్నాడు. అతడి వేధింపులకు విసిగిపోయిన బాలిక తల్లిదండ్రులు మిర్​గంజ్​ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. స్వీకరించిన పోలీసులు.. అతడిపై కఠిన చర్యలు తీసుకోకుండా చలానా వేసి కేసును మూసివేశారు. కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల నిందితుడు తిరిగి తమ కూతురిని వేధిస్తున్నాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

గిరిజన బాలికను ఎత్తుకెళ్లి ఐదురోజుల పాటు అత్యాచారం: మధ్యప్రదేశ్​ రెవాలో దారుణం జరిగింది. గిరిజన బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. సెప్టెంబర్​ 3న ఇంట్లో పడుకున్న బాలికను ఎత్తుకెళ్లాడు. అనంతరం బాలికను తన ఇంట్లో బంధించిన నిందితుడు.. ఐదు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి బయటపడిన బాలిక ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు మనోజ్​ తివారీని అరెస్ట్ చేశారు.

ఇవీ చదవండి: 'నొయిడా ట్విన్​ టవర్స్​ తరహాలో కూల్చేస్తాం'.. వారికి మంత్రి వార్నింగ్

'ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర- రూ.1,375 కోట్లతో ఆపరేషన్ లోటస్!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.