కేరళ తిరువనంతపురంలో దారుణం జరిగింది. శునకం మెడను బోటుకు కట్టేసి, కొట్టి చంపారు కొందరు యువకులు. ఈ కేసులో ఓ మైనర్ సహా ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
అసలేం జరిగింది?
ఆదిమలాతుర ప్రాంతానికి చెందిన క్రీస్తురాజ్ అనే వ్యక్తి లాబ్రడార్ జాతికి చెందిన బ్రూనో అనే శునకాన్ని పెంచుతున్నాడు. అది ఆడుకుంటూ విళింజం తీరప్రాంతానికి చేరుకుంది. అక్కడే ఓ బోటు కింద పడుకుని ఉంది. ఆ సమయంలో.. దాని మెడకు తాడు కట్టి, బోటుకు వేలాడిదీసి, కర్రలతో కొట్టారు నిందితులు. దెబ్బల ధాటికి శునకం ప్రాణాలొదిలింది.
తన శునకాన్ని హత్య చేయటంపై.. విళింజం పోలీసులకు క్రీస్తురాజ్ ఫిర్యాదు చేశాడు. ఓ మైనర్ సహా నిందితులైన శిలువయ్యన్(20), సునీల్(22)ను పోలీసులు అరెస్టు చేశారు.
![Dog brutally thrashed to death](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kl-tvm-01-0172021-nta-kl10003_01072021001444_0107f_1625078684_539_0107newsroom_1625110630_693.jpg)
మరోవైపు.. ఈ వీడియోను పోస్టు చేసేవారిని హత్య చేస్తానంటూ నిందితులు బెదిరించారని కూడా తమకు ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. జంతు హింస నేరం కింద వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అయితే.. తమలో ఓ వ్యక్తి తల్లిని సదరు శునకం కరిచిందని, అందుకే దానిపై దాడి చేశామని నిందితులు చెప్పారు.
ఇదీ చూడండి: తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కూతుళ్లు
ఇదీ చూడండి: పెళ్లి వద్దని మర్మాంగాన్ని కోసుకున్న యువకుడు!