దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే.. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వైరస్ ఉద్ధృతి ఆందోళనకరంగానే ఉంది. తమిళనాడులో 33,764 కేసులు బయటపడ్డాయి. 475 మంది మృతి చెందారు. దేశ రాజధానిలో వైరస్ కట్టడి చర్యలు ఫలిస్తున్నాయి. కొత్తగా 1,491 కేసులు వెలుగులోకి వచ్చాయి. 130 మంది వైరస్ భారిన పడి మరణించారు.
వివిధ రాష్ట్రాల్లో ఇలా..
- కేరళలో 28,798 కేసులు నమోదయ్యాయి. 151 మంది మృతి చెందారు.
- కర్ణాటకలో 26,811 కేసులు నమోదయ్యాయి. 530 మంది మరణించారు.
- బంగాల్లో 16,225 మందికి వైరస్ సోకింది. 153 మంది వైరస్ భారిన పడి మరణించారు.
- పంజాబ్లో 4,124 కేసులు కొత్తగా బయటపడ్డాయి. 186 మరణాలు సంభవించాయి.
ఇదీ చదవండి: కరోనా కట్టడిపై భారత్కు లాన్సెట్ 8 సూచనలు