ETV Bharat / bharat

భార్య నిత్యలక్ష్మి.. భర్త 'నిత్య' పెళ్లి కొడుకు!

మ్యాట్రిమోని ద్వారా అమ్మాయిలతో పరిచయం ఏర్పరుచుకుంటాడు. తమ కుమార్తెను కళ్లలో పెట్టుకుని చూసుకుంటానని ఆమె తల్లిదండ్రులను నమ్మిస్తాడు. అలా కుటుంబం సాయంతోనే నగదు, నగల కోసం పదికి పైగా వివాహాలు చేసుకున్న ఆ ప్రబుద్ధుని అసలు బాగోతం ఇదీ..

fake Marriage
విజయకుమార్‌
author img

By

Published : Dec 17, 2021, 11:21 AM IST

మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌లో వధువు కావాలని నమోదు చేసి బంగారం, నగదు కోసం మోసాలకు పాల్పడుతున్న భర్త, అతని కుటుంబంపై ఓ వివాహిత ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు.. చెన్నై, ఆవడి పట్టాభిరామ్‌ ప్రాంతానికి చెందిన నిత్యలక్ష్మి, కోయంబత్తూర్​కి చెందిన విజయకుమార్‌కి 2020 ఏప్రిల్‌లో వివాహమైంది. ప్రస్తుతం ఈ దంపతులకు ఎనిమిది నెలల కుమారుడు ఉన్నాడు. విజయకుమార్​ విదేశాల్లో ఉంటూ నిత్యలక్ష్మికి వేర్వేరు నంబర్లతో ఫోన్‌ చేసి మాట్లాడేవాడు. మూడు నెలల క్రితం నిత్యలక్ష్మికి ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది.

అందులో మాట్లాడిన మహిళ తన పేరు నాథశ్రీ అని, విజయకుమార్​ తనని అక్టోబర్​లో పెళ్లి చేసుకున్నాడని, ఇప్పుడు తనని మోసం చేసి వేరే మహిళను పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పింది. వివరాలు వాట్సప్‌లో పంపించింది. దీంతో దిగ్భ్రాంతికి గురైన నిత్యలక్ష్మి.. భర్త మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌లో వధువు కావాలని నమోదు చేసుకుని పదిమందికి పైగా మహిళలను పెళ్లి చేసుకుని మోసం చేశాడని తెలుసుకొంది.

బంగారం, నగదు కోసం మహిళలను లక్ష్యంగా చేసుకొని విజయకుమార్​ చెల్లెలు రేవతి, తండ్రి శక్తివేల్‌, అమ్మ హంసవేణి మోసానికి పాల్పడుతున్నట్లు బయటపడింది. దీనిపై ఆవడి ఆల్‌ వుమెన్‌ పోలీసుస్టేషన్‌లో నిత్యలక్ష్మి ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు ఆరోపిస్తోంది. విజయకుమార్​ కుటుంబంపై చర్యలు తీసుకోవాలని, 15 సవర్ల బంగారు నగలు, రూ.లక్ష నగదు ఇప్పించాలని డిమాండ్‌ చేస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.