ETV Bharat / bharat

'బాబా మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోండి' - అల్లోపతి వైద్య శాస్త్రం, వైద్యులపై రాందేవ్​ బాబా వ్యాఖ్యలు

అల్లోపతి మందులపై యోగా గురువు రాందేవ్​ బాబా చేసిన ప్రకటన 'చాలా దురదృష్టకరం' అని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ అన్నారు. బాబా తన మాటలను ఉపసంహరించుకోవాలని కోరారు.

Union Health Minister asks Ramdev
రాందేవ్​ బాబా, కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్
author img

By

Published : May 23, 2021, 10:00 PM IST

ప్రముఖ యోగా గురువు రాందేవ్​ బాబా.. అల్లోపతి వైద్య శాస్త్రం, వైద్యులను అవమానించేలా మాట్లాడారని భారత వైద్య సంఘం (ఐఎంఏ) ఆరోపించింది. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ తక్షణం స్పందించి ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం సామాజిక మాధ్యమాల్లో ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది ఐఎంఏ. అయితే దీనిపై కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర్​ హర్షవర్ధన్​ స్పందించారు. రాందేవ్​ బాబా చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. దీనిపై ఆయనకు లేఖ రాశారు.

"అల్లోపతి మందులపై మీ ప్రకటనలతో దేశస్థులు, వైద్యులు తీవ్రంగా బాధపడుతున్నారు. దీనిపై నేను ఇప్పటికే మీకు ఫోన్‌లో తెలియజేశాను. ప్రాణాంతక వైరస్​పై వ్యతిరేకంగా వైద్యులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు నిరంతరం పోరాడుతున్నారు. అందుకు వారిని అభినందించాలి. మీరు ఇటువంటి ప్రకటనలు చేసి, కొవిడ్ యోధులను అగౌరవపరచడమే కాక, దేశవాసుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు."

-హర్షవర్ధన్​, కేంద్ర ఆరోగ్యమంత్రి

ఇదీ చదవండి: 'బాబా రాందేవ్‌పై కేసు నమోదు చేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.