ETV Bharat / bharat

'అనాథల అక్రమ దత్తతలపై చర్యలు తీసుకోండి' - అక్రమ దత్తత

కరోనా కాలంలో అనాథ పిల్లల పేరుతో అక్రమాలకు పాల్పడుతోన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. అనాథ పిల్లలకు సకాలంలో అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

Supreme court on orphans
అనాథ పిల్లలపై సుప్రీంకోర్టు
author img

By

Published : Jun 8, 2021, 6:12 PM IST

కొవిడ్​ సమయంలో అనాథ పిల్లలను అక్రమంగా దత్తత తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్​సీపీసీఆర్​)కు రాష్ట్రాలు సమర్పించిన డేటా ఆధారంగా ఈ ఏడాది జూన్​ 5 నాటికి కరోనా వల్ల 30 వేల మందికిపైగా పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయినట్లు పేర్కొంది.

అనాథలుగా మారిన లేదా తల్లిదండ్రులను కోల్పోయిన లేదా విడిచిపెట్టిన మైనర్ల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నత న్యాయస్థానం.. అనాథలను దత్తత తీసుకోవటానికి ఆహ్వానించడం చట్ట విరుద్ధమని పేర్కొంది. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్​ ప్రమేయం లేకుండా దత్తత తీసుకోవటానికి అనుమతి లేదని తెలిపింది.

జువెనైల్ జస్టిస్ చట్టం-2015లోని నిబంధనలను, అనాథ పిల్లలకు ప్రయోజనం చేకూర్చే ప్రభుత్వ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. అనాథలుగా మారుతున్నవారిని గుర్తించి, వారికి సంబంధించిన డేటాను ఎన్​సీపీసీఆర్​ వెబ్​సైట్​లో పొందుపరచాలని నిర్దేశించింది. అనాథ పిల్లల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న ఎన్​జీఓ/ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

అంతకుముందు, అనాథ పిల్లల కనీస అవసరాలు తీర్చాలని సంబంధిత సంస్థలకు జూన్​ 7న ఆదేశాలు జారీ చేసిన సర్వోన్నత ధర్మాసనం.. ఎలాంటి జాప్యం లేకుండా ప్రస్తుత ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందించాలని పేర్కొంది.

ఇదీ చూడండి: 44కోట్ల టీకా డోసులకు కేంద్రం ఆర్డర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.