ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహాలో సెల్ఫీ వీడియో తీసుకుని, ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు రక్షించారు. వికాస్ నగర్‌లోని గంగానది వద్ద ఈ ఘటన జరిగింది.
ఇదీ జరిగింది..
వికాస్ నగర్‌కు చెందిన రాహుల్ వర్మ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొద్దిరోజులుగా నష్టాలు చవిచూడటం వల్ల తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ క్రమంలోనే గంగానది వద్దకు వెళ్లి, తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఓ వీడియో చిత్రీకరించాడు. ఈ దృశ్యాలను కుటుంబ సభ్యులకు పంపాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అప్రమత్తమై బ్రజ్‌ఘాట్ బ్రిడ్జ్ వద్దకు వెళ్లారు. అప్పటికే నదిలోకి దూకిన రాహుల్‌ను కాపాడారు. అనంతరం అతడ్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఇదీ చదవండి: భర్తకు సెల్ఫీ వీడియో పంపి భార్య ఆత్మహత్య