ETV Bharat / bharat

విదేశాల్లో రూ.30 కోట్ల బిజినెస్​.. వ్యాపారాన్ని వదిలి గో సంరక్షణ కోసం దేశానికి.. - భుజ్ మందిర్ 200 సంవత్సరాలు 2023

రమేష్ భాయ్ దబాసియ అనే వ్యాపార వేత్త ఏకంగా 30 కోట్ల టర్నోవర్​ అయ్యే వ్యాపారాన్ని వదిలి.. ఆలయ ఉత్సవాల కోసం వచ్చారు. ఆ ఉత్సవాలు ఏంటి.. ఆయన ఎందుకు వచ్చారో తెలుసుకుందాం.

swaminarayan-temple-bicentennial-celebration 2023
స్వామినారాయణ దేవాలయ ద్విశాబ్ది ఉత్సవాలు
author img

By

Published : Apr 9, 2023, 11:09 AM IST

స్వామినారాయణ దేవాలయ ద్విశాబ్ది ఉత్సవాల కోసం ఓ వ్యక్తి.. ఏకంగా సంవత్సరానికి 30 కోట్ల టర్నోవర్​ వచ్చే వ్యాపారాన్ని వదిలేశారు. పూర్తి వ్యాపారాన్ని సోదరుడికి అప్పగించి.. మూడు నెలల క్రితం స్వామినారాయణ దేవాలయ ఆలయానికి వచ్చారు. ఉత్సవ ఏర్పాట్లన్నింటినీ ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు రమేష్ భాయ్ దబాసియా. ఈయనతో పాటు వేల మంది భక్తులు దేవాలయానికి చేరుకుని ఉత్సవాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 1500 మంది వాలంటీర్లు కూడా ఉత్సవ పనులు చేస్తున్నారు. గుజరాత్​.. కచ్​ జిల్లాలోని భుజ్​ ప్రాంతంలో ఈ స్వామినారాయణ దేవాలయం ఉంది.

30 కోట్ల వ్యాపారం వదిలి..
రమేష్ భాయ్ దబాసియా.. భుజ్ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త. ఆఫ్రికా దేశాల్లో రమేష్ భాయ్​కి చాలా వ్యాపారాలు ఉన్నాయి. గ్రానైట్, మార్బుల్, బ్లూ స్టోన్‌.. వంటి వాటిని వివిధ దేశాలకు దిగుమతి, ఎగుమతి చేస్తుంటారు. యంత్రాలను సైతం దిగుమతి, ఎగుమతి చేస్తారు. "నా కంపెనీ ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ బ్లూ పెర్ల్ ఇంటర్నేషనల్. నా వార్షిక టర్నోవర్ సుమారు 25 నుంచి 30 కోట్లు ఉంటుంది." అని రమేష్ భాయ్ దబాసియా తెలిపారు. స్వామి నారాయణ దేవ్​పై భక్తితో ఇక్కడికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం తన వ్యాపారాన్ని సోదరుడికి అప్పగించినట్లు ఆయన వెల్లడించారు.

swaminarayan-temple-bicentennial-celebration 2023
రమేష్ భాయ్ దబాసియా

స్వామినారాయణ దేవాలయం నిర్మాణం జరిగి 200 సంవత్సరాలు పూర్తైన.. సందర్భంగా ద్విశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సిద్ధమైంది. జిల్లాలో మొదటి సారిగా స్వామి నారాయణ ద్విదశాబ్ది ఉత్సవాలను జరుతున్నారు. 250 ఎకరాలలో నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి దాదాపు 30 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని నిర్వహకులు అంచనా వేస్తున్నారు. ఉత్సవాలను విజయవంతం పూర్తి చేయాలని నిర్వాహకులు కోరారు.

swaminarayan-temple-bicentennial-celebration 2023
స్వామినారాయణ దేవాలయ ద్విశాబ్ది ఉత్సవాలు
swaminarayan-temple-bicentennial-celebration 2023
రమేష్ భాయ్ దబాసియా

2.5 ఎకరాల్లో ఆవుల పదర్శన శాల..
ఈ ఉత్సవాల్లో ఆవుల ప్రదర్శనశాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. 2.5 ఎకరాల్లో ఈ ప్రదర్శన ఉంటుందని వారు వెల్లడించారు. ఆవు గొప్పతనాన్ని ప్రజలను వివరించేందుకే ఈ ప్రయత్నమని వారు పేర్కొన్నారు. ఇందులో ఆవుల పెంపకం, వాటికి మనుషులకు ఉండే సంబంధాలు, ప్రాచీన కాలం నుంచి అవి చేసే సేవలు.. వివరించే విధంగా ప్రదర్శన ఉంటుందని నిర్వహకులు తెలిపారు. వ్యాపార వేత్త రమేష్ భాయ్ దబాసియ ఆవులు పదర్శన శాలకు తోడ్పాటు అందించారని వారు వెల్లడించారు. స్వామి నారాయణ దేవాలయాల పిల్లర్లు, గోడలను కూడా.. పూర్తిగా సహజమైన పద్ధతిలో అలంకరించారు. వాటికి పేడతో కూడిని రంగులు వేశారు.

గోడకు పేడతో రంగులు వేస్తున్న మహిళలు

ఆవుల పదర్శన శాల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.