బంగాల్ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పోటీగా నిలిచిన సువేందు అధికారి ఎన్నికల కమిషన్కు తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఈ మేరకు శనివారం అఫిడవిట్ సమర్పించారు. తమ ఆస్తుల విలువ రూ.80,66,749.32 అని అందులో పేర్కొన్నారు.
చరాస్తుల విలువ
సువేందు చరాస్తుల విలువ రూ 59.31 లక్షలుకాగా బ్యాంక్ బ్యాలెన్స్ రూ.46.15 లక్షలు ఉంది. ఇందులో రూ.41,823 ఎన్నికల ఖర్చుల కోసం కేటాయించిన ఖాతాలో ఉన్నాయి. మొత్తం స్థిరాస్తుల విలువ రూ. 46.21 లక్షలు. 2019-20 సంవత్సరంలో సువేందు ఆదాయం రూ.11.15 లక్షలు. నేష్నల్ సేవింగ్స్ సర్టిఫికెట్ కింద రూ. 5.45 లక్షలు డిపాజిట్ సహా రూ.7.71 లక్షల బీమా ఉందని సువేందు అఫిడవిట్లో పేర్కొన్నారు.
క్రిమినల్ కేసులు పెండింగ్
తనపై పలు క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని సువేందు వెల్లడించారు. రవీంద్రభారతి విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేసినట్టు ఈసీకి తెలిపారు. శుక్రవారం నాడు సువేందు తన నామినేషన్ను దాఖలు చేశారు.
ఇదీ చదవండి : మమతా బెనర్జీ ఆస్తుల విలువెంతో తెలుసా?