రామాయణ పారాయణమే కాదు.. అందులోని సారాన్ని వివరిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటోంది గుజరాత్‌కు చెందిన 11 ఏళ్ల చిన్నారి. ఈ పురాణ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిందేమిటో చెబుతూ 108 వీడియోలు చేసింది. ఈ వీడియోలకు మొత్తంగా లక్షల్లో వ్యూస్ రావడం విశేషం.
పిల్లల బాధ్యతను గుర్తుచేస్తూ..
సూరత్‌కు చెందిన భవిక మహేశ్వరి.. కేవలం రామాయణం సారాంశం చెప్పడమే కాదు.. పిల్లల బాధ్యత ఏమిటో చెబుతూ పలు వీడియోలు చేసింది. ఈ వీడియోలకు కూడా విపరీతంగా వ్యూస్ వచ్చాయి. అయితే.. రామాయణంపై తనకున్న అవగాహనతో అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేసింది భవిక. లాక్డౌన్ సమయంలోనే రామాయణాన్ని పూర్తిగా చదవి యూట్యూబ్ వీడియోలు చేయడం ప్రారంభించినట్లు తెలిపింది.
భవిక.. తన నానమ్మ, తాతయ్యతో కలిసి మతపరమైన కార్యక్రమాలకు హాజరయ్యేదని చిన్నారి తల్లిదండ్రులు చెప్పారు. లాక్డౌన్ సమయంలో రామాయణం బాగా పాపులర్ అయిన నేపథ్యంలో భవికకు.. దానిపై మరింత ఆసక్తి పెరిగిందని తెలిపారు. తాను వీడియోలు చేయడం ప్రారంభించాక వీక్షకుల నుంచి మంచి స్పందన రావడం గర్వంగా అనిపించిందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:చీరకట్టులో సవారీలు.. రూ.లక్షల్లో ఆర్జన!