ETV Bharat / bharat

మోదీని విమర్శించిన కేసులో జర్నలిస్ట్​కు ఊరట

ప్రముఖ పాత్రికేయుడు వినోద్​ దువాపై దేశద్రోహం కేసును కొట్టివేసింది సుప్రీంకోర్టు. 1962 నాటి తీర్పు జర్నలిస్టులకు రక్షణ కల్పిస్తుందని, దానిని పరిగణలోకి తీసుకుంటే ఈ కేసు చెల్లదని స్పష్టంచేసింది.

journalist Vinod Dua
వినోద్​ దువాపై దేశద్రోహం కేసు కొట్టివేత
author img

By

Published : Jun 3, 2021, 11:08 AM IST

Updated : Jun 3, 2021, 2:01 PM IST

ప్రమఖ సీనియర్​ జర్నలిస్టు వినోద్​ దువాపై దేశద్రోహం కేసును గురువారం కొట్టివేసింది సుప్రీంకోర్టు. దిల్లీ అల్లర్ల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గతేడాది మేలో ఆయనపై దేశద్రోహం సహా పలు ఇతర కేసులు నమోదయ్యాయి. అయితే 1962 నాటి కేదార్‌నాథ్‌ కేసు తీర్పును పరిగణనలోకి తీసుకుంటే ఈ కేసు చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

1962 తీర్పు పాత్రికేయులకు పూర్తి రక్షణ కల్పిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ప్రభుత్వంపై విమర్శలు చేసే పౌరులపై దేశద్రోహ అభియోగాలు మోపరాదని, అది భావప్రకటనా స్వేచ్ఛకే విరుద్ధమని 1962లో సుప్రీం తీర్పుచెప్పింది.

అయితే 10ఏళ్ల అనుభవం గల పాత్రికేయులపై సంబంధిత కమిటీ ఆమోదం తర్వాతే ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలన్న దువా విజ్ఞప్తిని జస్టిస్​ యుయు లలిత్, జస్టిస్ వినీత్ శరణ్​తో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. అది కార్యనిర్వాహక పరిధిలో జోక్యం చేసుకోవడమే అవుతుందని తెలిపింది.

కేసు పూర్వపరాలు..

వినోద్​ దువా వ్యాఖ్యలపై హిమాచల్​ ప్రదేశ్​లోని స్థానిక భాజపా నేత శ్యామ్​ ఫిర్యాదుతో మే6న పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. దీనిపై దువా సుప్రీంను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు.. జూన్​ 14న తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు అరెస్టు చేయొద్దని ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను జులై 20న మరోసారి పొడింగించింది. అనంతరం అక్టోబర్ 6న తీర్పును రిజర్వ్​ చేసిన న్యాయస్థానం.. నేడు(గురువారం) కేసు కొట్టివేసింది.

ఇవీ చూడండి:

'నోరు మూయించడానికి దేశద్రోహం కేసులా!'

'దేశద్రోహ చట్టం రాజ్యాంగబద్ధతపై మీ వైఖరేంటి?'

Last Updated : Jun 3, 2021, 2:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.