Supreme Court on MLC Kavitha Petition : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 26 వరకు కవితకు సమన్లు జారీ చేయవద్దని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. నళినీ చిందబరం తరహాలోనే తనకూ ఊరట ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ వేశారు. ఆమె వేసిన పిటిషన్‌పై ఈడీ న్యాయవాది స్పందనను సుప్రీం ధర్మాసనం కోరింది. అందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అదనపు సొలిసిటర్ జనరల్ తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 26 వరకు సమన్లు జారీ చేయవద్దని ఈడీ(Enforcement Directorate)కి జస్టిస్ కౌల్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
Delhi liquor Scam ED Notice : దిల్లీ మద్యం కుంభకోణం(Delhi liquor Scam) కేసులో కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) గురువారం మరోసారి సమన్లు జారీ చేసింది. అందులో శుక్రవారం దిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఉంది. ఈ విషయంపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 50 కింద తనకు ఈడీ సమన్లు జారీ చేయడాన్ని ఆమె సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. ఈడీ జారీ చేసిన సమన్లు.. మహిళలను వారు నివసించే చోటే విచారించాలన్న సీఆర్పీసీలోని సెక్షన్ 160 నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్నందున వెంటనే వాటిని కొట్టేయాలని కవిత కోరారు. దీంతో సుప్రీంకోర్టు కాజ్లిస్ట్ ప్రకారం శుక్రవారం ఈ కేసు విచారణకు వచ్చి.. ఈ నెల 26 వరకు సమన్లు జారీ చేయవద్దని ఈడీకి ఆదేశాలు జారీ చేసింది.
BRAVE LADY Kavitha : ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా హైదరాబాద్‌లో పోస్టర్లు
ఇంటికి వచ్చి విచారించండి.. ఆడియో, వీడియో ద్వారా అయినా ఓకే : ఎమ్మెల్సీ కవిత
అదే ఈడీ ప్రధాన అభియోగం..: వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్, ఎమ్మెల్సీ కవితలు సౌత్ గ్రూప్ ద్వారా ఆప్ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు చెల్లించి దిల్లీ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారు చేయించుకొని అనుచిత లబ్ధి పొందారన్నది ఈడీ ప్రధాన అభియోగం. ఈ నేపథ్యంలో ఆ సంస్థ గత మార్చి 16, 20, 21వ తేదీల్లో కవితను దిల్లీలో విచారించింది. ఈ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అఫ్రూవర్‌గా మారారు.
హైదరాబాద్ బిర్యానీ తిని.. హ్యాపీగా వెళ్లండి..: ఇదిలా ఉండగా.. రాహుల్ గాంధీపై మాట్లాడే స్థాయి ఎమ్మెల్సీ కవితకు లేదంటూ కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రస్థాయిలో స్పందించారు. బీజేపీతో అవగాహన కుదిరినందుకే సోనియా, రాహుల్‌పై ఈడీ కేసులు ఏడాదిగా ముందుకు కదలడం లేదా అంటూ కవిత ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణ ఏమయిందని.. కాంగ్రెస్, బీజేపీ మధ్య కుదిరిన అవగాహన ఏమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సీడబ్ల్యూసీ సమావేశాలకు వస్తున్న రాజకీయ టూరిస్టులకు స్వాగతమంటూ.. హైదరాబాద్ బిర్యానీ తిని సంతోషంగా వెళ్లండి కానీ ప్రజలను మరోసారి మభ్యపెట్టవద్దని కవిత వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
దిల్లీ మద్యం కేసులో 36 మంది.. కల్వకుంట్ల కవిత సహా కీలక నేతలు..!
దిల్లీ మద్యం కేసు.. ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ అరెస్టు