ETV Bharat / bharat

'కోర్టులంటే గౌరవం లేదా! మరీ ఇంత అహంకారమా?'

ఓ ఉద్యోగి విషయంలో యూపీ అదనపు ప్రధాన కార్యదర్శి (రెవిన్యూ), ఆర్థిక కార్యదర్శి వ్యవహరించిన తీరు సరిగా లేదని సుప్రీంకోర్టు మండిపడింది. ఉద్యోగి సర్వీసును (sc on up officers) క్రమబద్దీకరించి, బకాయిలు చెల్లించడంలో అధికారులు చేస్తున్న తీవ్ర జాప్యాన్ని తప్పుపట్టింది. మరీ ఇంత అహంకారమా, న్యాయస్థానమంటే గౌరవం లేదా అంటూ నిలదీసింది.

suprem court judgement
యూపీ ఉద్యోగులపై సుప్రీంకోర్టు తీర్పు
author img

By

Published : Nov 14, 2021, 7:12 AM IST

ఉత్తర్‌ప్రదేశ్‌ ఉన్నతాధికారులపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని (sc on up officers) సుప్రీం ధర్మాసనం(Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ ఉద్యోగి సర్వీసును క్రమబద్ధీకరించి, బకాయిలు చెల్లించడంలో అధికారులు చేస్తున్న తీవ్ర జాప్యాన్ని తప్పుపట్టింది. మరీ ఇంత అహంకారమా, న్యాయస్థానమంటే గౌరవం లేదా అంటూ నిలదీసింది. ఉద్యోగి విషయంలో యూపీ అదనపు ప్రధాన కార్యదర్శి (రెవిన్యూ), ఆర్థిక కార్యదర్శి వ్యవహరించిన తీరు సరిగా లేదని మండిపడింది. అధికారులపై అలహాబాద్‌ హైకోర్టు(Allahabad high court) జారీ చేసిన బెయిలబుల్‌ వారంట్లను నిలుపుదల చేయాలంటూ ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం(Utter Pradesh government) వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో అధికారుల అరెస్టుకు మార్గం సుగమమైంది.

నవంబర్‌ ఒకటిన బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేస్తూ హైకోర్టు కూడా అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. న్యాయస్థానాన్ని ఆటస్థలంగా భావిస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. యూపీ ప్రభుత్వ పిటిషన్‌ను శనివారం విచారించిన సుప్రీం ధర్మాసనం "ఏం వాదనలు చేస్తున్నారు? ఇవన్నీ మీరు అరెస్టయ్యాక, బోనులో ప్రవేశపెట్టినప్పుడు హైకోర్టులో చేసుకోండి. ఈ పాటికే మిమ్మల్ని అరెస్టు చేయమని హైకోర్టు ఉత్తర్వులిచ్చి ఉండాలి. కానీ వారు దయతో వ్యవహరించారు. అయినా ఆదేశాలను పాటించలేదు. మీకు కోర్టంటే గౌరవం లేదు. మీ ప్రవర్తనను ఒక్కసారి పరిశీలించుకోండి. ఒక ఉద్యోగికి న్యాయంగా రావాల్సిన బకాయిలను దూరం చేస్తున్నారు. అదనపు ప్రధాన కార్యదర్శి అహంకారపూరితంగా వ్యవహరించారు" అని పేర్కొంది.

ఇదీ చదవండి:ఆంగ్లంపై సీజేఐ- సొలిసిటర్​ జనరల్​ మధ్య ఆసక్తికర సంభాషణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.