ETV Bharat / bharat

బళ్లారి వెళ్లేందుకు 'గాలి'కి సుప్రీం అనుమతి

అక్రమ మైనింగ్​ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్​ రెడ్డి బళ్లారి వెళ్లేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. కానీ కొన్ని షరతులను కూడా విధించింది. ఎన్ని రోజులు, ఎక్కడికి వెళ్తారో ఎస్పీకి చెప్పాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

Gali Janardhan Reddy
గాలి జనార్దన్​ రెడ్
author img

By

Published : Aug 19, 2021, 4:57 PM IST

Updated : Aug 20, 2021, 6:27 AM IST

ఎట్టకేలకు గాలి జనార్దన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. బళ్లారి వెళ్లేందుకు ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతిచ్చింది. పరిమిత సమయంలో స్వస్థలం బళ్లారిని సందర్శించేందుకు అవకాశం కల్పించింది. ఎన్ని రోజులు, ఎక్కడికి వెళ్తారో ఎస్పీకి చెప్పాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. 2015 జనవరిలో ఇచ్చిన బెయిల్‌ ఆంక్షల్లో సుప్రీంకోర్టు స్వల్ప మార్పులు చేసింది. విచారణ త్వరగా ముగించాలని హైదరాబాద్‌ సీబీఐ ప్రత్యేక కోర్టును ఆదేశించింది. పిటిషన్‌పై పూర్తి స్థాయి విచారణ 3 నెలల తర్వాత చేపడతామని ధర్మాసనం తెలిపింది. నవంబర్‌ మూడో వారంలో లిస్ట్‌ చేయాలని కోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.

తన బెయిల్​ షరతులను సడలించాలని, 8 వారాల పాటు బళ్లారిలో ఉండేందుకు అనుమతించాలని గాలి జనార్దన్‌రెడ్డి ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేశ్ మహేశ్వరితో కూడిన ద్విసభ్య ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. జనార్దన్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. అయితే, గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్​ షరతులు సడలించవద్దని సీబీఐ కోరింది. సడలిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, కేసు విచారణలో ఇబ్బందులు వస్తాయని కోర్టుకు తెలిపింది. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం గాలి జనార్దన్‌రెడ్డి బళ్లారి వెళ్లేందుకు అనుమతిచ్చింది.

ఇదీ చూడండి: 'గాలి' బళ్లారిలో ఉంటే సాక్షులకు ముప్పు

Last Updated : Aug 20, 2021, 6:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.