Superstar Rajinikanth Punch Dialogue: రాజకీయాలకు దూరంగా ఉంటానని గతంలో రజనీకాంత్ స్పష్టం చేశారు. అంతేకాకుండా భవిష్యత్‌లోనూ రాజకీయాల్లోకి రాబోనని వివరించారు. తన ఆరోగ్యం సహకరించటం లేదని అందుకే రాజకీయ జీవితానికి దూరంగా ఉండనున్నట్లు వివరణ ఇచ్చారు. అందుకు తగినట్లుగా ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు.
రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న తలైవా.. తాజాగా చెప్పిన డైలాగ్ మాత్రం తనను విమర్శించిన వారిని గట్టి ఎదురుదెబ్బ కొట్టినట్లుగా అనిపిస్తోంది. ఆయన చెప్పిన ప్రతి మాట విమర్శకులకు సూటిగా బాణాలు విసిరినట్లుగా అనిపిస్తున్నాయి. తనపై రాజకీయంగా విమర్శించిన వారికి.. ఈ డైలాగుల ద్వారా బదులిచ్చినట్లుగా ఉంది. ఆయన చెప్పిన డైలాగులు తాజాగా నెట్లింట్లో వైరల్ అవుతున్నాయి.
తలైవాను అలా చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్
Fans Reaction on Superstar Rajini Dialogue: సూపర్ స్టార్ రజనీ అభిమానులు ఆయన చెప్పిన డైలాగులను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఇప్పుడు తెలిసిందా రాజా.. ఎవరి కోసమో ఈ కామెంట్లు అని ఓ అభిమాని స్పందిస్తే.. మరో అభిమాని మాత్రం డైలాగులు ఎవరి కోసమైనా సూపర్‌గా చెప్పారంటూ ట్వీట్ చేశారు. చివర్లో డైలాగు తెలుగులో చెప్పారంటే తెలుగువాళ్ల కోసమేనని మరో అభిమాని సమాధానమిచ్చారు. రజనీకాంత్ సూపర్ మెసేజ్ ఇచ్చారంటూ మరొకరు ట్వీట్ చేశారు.
ఇంతకీ రజనీకాంత్ ఏమన్నారంటే.. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఈ లోకంలో మొరగని కుక్క ఉండదు... విమర్శించని నోరు ఉండదు... ఇవి రెండూ జరగని ఊరు ఉండదు.. మన పని మనం చేసుకుంటూ ముందుకు పోవాలి.. అర్థమైందా రాజా" అని అన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న అభిమానులు ఆయన చెప్పిన ఈ మాటలకు ఉర్రూతలూగిపోయారు.
-
Ee speech entra intha high istundi😭🔥 pic.twitter.com/lf2F3iGAtG
— Abhiii (@Abhiiitweets) August 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ee speech entra intha high istundi😭🔥 pic.twitter.com/lf2F3iGAtG
— Abhiii (@Abhiiitweets) August 7, 2023Ee speech entra intha high istundi😭🔥 pic.twitter.com/lf2F3iGAtG
— Abhiii (@Abhiiitweets) August 7, 2023
'మార్పు రావాలి.. ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ రాదు'
Rajinikanth Dialogue Viral: రజనీకాంత్ కౌంటర్ ఇచ్చారని నెట్టింట వైరల్: సూపర్‌స్టార్ రజనీకాంత్ తనపై రాజకీయ విమర్శలు చేసినవారికి.. గట్టి కౌంటర్ ఇచ్చేందుకే ఈ డైలాగ్ చెప్పి ఉంటారని సామాజిక మాధ్యమాల్లో ఇంటర్నెట్ ప్రియుల షేరింగ్‌తో వైరల్‌గా మారింది. గతంలో టీడీపీ నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నిర్వహించగా.. ఆ కార్యక్రమంలో రజనీకాంత్ పాల్గొన్నారు.
ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌పై, టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. ఈ ప్రశంసలకు ఆయన రాజకీయ విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో రజనీకాంత్ వ్యాఖ్యలపై ఆంధ్ర రాజకీయంలో తీవ్ర దుమారమే రేగింది.
TDP Fires on YSRCP: "రజనీపై విమర్శలు మాని ప్రజాసమస్యలను పరిష్కరిస్తే బాగుంటుంది"