ETV Bharat / bharat

మాస్టర్​మైండ్​ 'సునీల్ కనుగోలు'కు 'కీ' పోస్ట్​.. సిద్ధరామయ్యకు ప్రధాన సలహాదారుగా..

Sunil Kanugolu Karnataka : ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలును ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారుడిగా నియమించింది కర్ణాటక ప్రభుత్వం. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కేబినెట్​ హోదాకు లభించే అన్ని సౌకర్యాలు కల్పించాలని సీఎం సిద్ధరామయ్య.. సీఎస్​ను ఆదేశించారు.

sunil kanugolu karnataka election
sunil kanugolu karnataka election
author img

By

Published : Jun 1, 2023, 4:13 PM IST

Sunil Kanugolu Karnataka Election : ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుకు కీలక పదవిని కట్టబెట్టింది కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ప్రధాన సలహాదారుడిగా నియమించింది. తక్షణమే ఆయనకు కేబినెట్​ హోదాకు లభించే అన్ని సౌకర్యాలను కల్పించాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు సీఎం సిద్ధరామయ్య. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్​ను విజయపథంలో నడిపించిన ఐదు ఉచిత హామీలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలయ్యేలా సునీల్​.. సలహాలు ఇస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంలో కీలక పాత్ర పోషించిన సునీల్​.. ఇకపై పరిపాలనలోనూ తనదైన ముద్రను వేయనున్నారు.

  • Sunil Kanugolu, a poll strategist who worked behind the success of Congress in the Karnataka election, appointed as the chief advisor to CM Siddaramaiah, with the cabinet minister rank.#sunilkanugolu pic.twitter.com/A8jxqtkWHw

    — Suresh Kumar (@journsuresh) June 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కర్ణాటకలో కాంగ్రెస్​ అఖండ విజయం సాధించడంలో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కీలక పాత్ర పోషించారు. ఎన్నికల ముందు ఉచిత హామీల దగ్గర నుంచి అవి ప్రజల్లోకి చేరే వరకు ఆయన తీవ్రంగా శ్రమించారు. ముఖ్యమంత్రి బొమ్మైపై 40శాతం కమీషన్లు తీసుకొంటున్నట్లు చేసిన ఆరోపణలను అవకాశంగా తీసుకొని 'పే సీఎం' పేరిట ప్రచారంలో ఆయనదే కీలక పాత్ర. అమూల్‌ వర్సెస్‌ నందినీ డెయిరీల వ్యహారాన్ని కన్నడిగుల ఆత్మగౌరవంతో ముడిపెట్టి ప్రచారం చేయడంలో సునీల్‌ బృందం పాత్ర ఉంది. కర్ణాటకలో చివరకు టికెట్ల పంపిణీల్లో సునీల్‌ బృందం సర్వే సూచనల మేరకే కాంగ్రెస్‌ అధినాయకత్వం కేటాయింపులు చేసింది. ఇలా బీజేపీ ఎత్తుగడలను చిత్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారు సునీల్​.

sunil kanugolu karnataka election
'పే సీఎం' ప్రచారం

ఎవరీ సునీల్ కనుగోలు?
Sunil Kanugolu Wikipedia : సునీల్‌ కనుగోలు కర్ణాటకలోని బళ్లారిలో జన్మించారు. ఆ తర్వాత చదువు కోసం చెన్నైకు మకాం మార్చారు. అనంతరం అమెరికా వెళ్లి ఎంబీఏ చదివి.. అక్కడే అంతర్జాతీయ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌ మెకన్సీ కోసం పనిచేశారు. తర్వాత భారత్‌కు తిరిగి వచ్చిన సునీల్​.. గుజరాత్‌ రాజకీయ వ్యూహాల్లో చురుగ్గా పనిచేశారు. ది అసోసియేషన్‌ ఆఫ్‌ బిలియన్‌ మైండ్స్‌కు చీఫ్‌గా పనిచేశారు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ వ్యూహకర్తల బృందంలో సునీల్‌ కూడా ఒకరు.

ఆ తర్వాత బీజేపీ కోసం ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేశారు. 2019లో తమిళనాట స్టాలిన్‌ కోసం పనిచేసిన సునీల్‌.. డీఎంకేకు 38 పార్లమెంట్‌ స్థానాల్లో గెలిపించడంలో ప్రధానపాత్ర పోషించారు. ఈ ఎన్నికలే స్టాలిన్‌ను తమిళనాడులో తిరుగు లేని నేతగా నిలబెట్టాయి. ఆ తర్వాత ప్రశాంత్‌ కిషోర్‌కు చెందిన ఐప్యాక్‌ బృందం డీఎంకేకు సేవలందించడం వల్ల సునీల్‌ బెంగళూరుకు వెళ్లిపోయారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నాటి సీఎం పళనిస్వామి కోరిక మేరకు అన్నాడీఎంకేకు పనిచేశారు.

sunil kanugolu karnataka election
సునీల్ కనుగోలు

ఈ విజయంతో కాంగ్రెస్‌ పార్టీలో సునీల్‌ కనుగోలు మరింత కీలకంగా మారారు. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేయనున్నారు. గతేడాది పార్టీ తరపున పనిచేయడం మొదలుపెట్టిన రెండు నెలలకే సోనియా గాంధీ ఆయన్ను 2024 లోక్‌సభ ఎలక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యుడిగా నియమించారు.

Karnataka Election Results : 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకకు ఈనెల 10న ఎన్నికలు జరిగాయి. మే 13న వెలువడ్డ ఫలితాల్లో కాంగ్రెస్​ 135 స్థానాల్లో విజయఢంకా మొగించింది. కాగా, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్​ ఫిగర్​ 113ను సునాయాసంగా దాటేసి మే 20న సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. భారతీయ జనతా పార్టీ 66 సీట్లు, మాజీ ప్రధాని దేవెగౌడ సారథ్యంలోని జేడీఎస్‌ 19 స్థానాలు గెలుపొందాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.