ETV Bharat / bharat

Student Gangrape : ఎగ్జామ్​ రాస్తున్న 'ఆమె' కిడ్నాప్​.. ఆటోలో మద్యం తాగించి.. హోటల్​లో గ్యాంగ్​రేప్​ చేసి.. - విద్యార్థిని కిడ్నాప్​ గ్యాంగ్​ రేప్​

Student Gangrape In Karnataka : కాలేజీలో పరీక్ష రాస్తున్న విద్యార్థినిని మాయమాటలు చెప్పి కిడ్నాప్​ చేశారు నలుగురు యువకులు. అనంతరం ఆటోలో మద్యం తాగించి హోటల్​కు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. కర్ణాటకలోని బళ్లారిలో జరిగిందీ ఘటన. మరోవైపు, ఉత్తర్​ప్రదేశ్​లో మేనకోడలిపై అత్యాచారం చేసిన వ్యక్తికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు.

Student Gangrape In Karnataka
Student Gangrape In Karnataka
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 6:04 PM IST

Student Gangrape In Karnataka : కర్ణాటకలోని బళ్లారిలో పరీక్ష రాస్తున్న కాలేజీ విద్యార్థినిని కిడ్నాప్ చేసి నలుగురు యువకులు.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాన నిందితుడిని నవీన్​గా గుర్తించి అరెస్ట్​ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బళ్లారిలోని ఓ కళాశాలలో బాధితురాలు.. గ్రాడ్యుయేషన్​ చదువుతోంది. అక్టోబరు 11న కళాశాలలో పరీక్ష రాస్తోంది. ఆ సమయంలో సోదరుడు వచ్చాడని మాయమాటలు చెప్పి ఆమెను బయటకు పిలిపించారు నలుగురు యువకులు. అనంతరం ఆమెను ఆటోలోకి ఎక్కించి మద్యం తాగించారు. ఆ తర్వాత కొప్పల్​ జిల్లాలో ఓ గ్రామంలో హోటల్​కు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

బాధితురాలి తండ్రి.. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌల్‌బజార్‌కు చెందిన నవీన్‌, తన్నూ, షకీబ్‌ సహా నలుగురు వ్యక్తులు ఈ చర్యకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న బళ్లారి పోలీసులు.. ప్రధాన నిందితుడిని అరెస్ట్​ చేశారు. మరో ముగ్గురి కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు

"21 ఏళ్ల బీకామ్ విద్యార్థిని అక్టోబర్ 11న కాలేజీలో పరీక్ష రాస్తోంది. ఆ సమయంలో ఆమెకు తెలిసిన ఓ యువకుడు తన అన్న వచ్చాడని మాయమాటలు చెప్పి బయటకు పిలిచాడు. అనంతరం నలుగురు యువకులు బలవంతంగా ఆమెను ఆటోలో తీసుకెళ్లారు. తర్వాత సమీపంలోని హోటల్‌లో గది బుక్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులంతా బళ్లారికి చెందిన వారు. ఇప్పటికే ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపాం. మిగిలిన వారిని వీలైనంత త్వరగా అరెస్ట్ చేస్తాం" అని పోలీస్​ సూపరింటెండెంట్​ రంజిత్ కుమార్​ తెలిపారు.

మైనర్​పై అత్యాచారం.. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
మైనర్​ అయిన మేనకోడలిపై అత్యాచారం చేసిన వ్యక్తికి పోక్సో చట్టం కింద ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. రూ.30000 జరిమానా కూడా విధించింది. ఆ జరిమానా మొత్తంలో సగం బాధితురాలికి ఇవ్వాలని కోర్టు పేర్కొంది. ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూలో ఈ ఘటన జరిగింది.

న్యాయవాది సుఖేంద్ర ప్రతాప్‌సింగ్‌.. కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం.. 2017 జూలై 17న తన భార్య, కుమారుడితో కలిసి సింగర్‌ నగర్‌కు వెళ్లాడు నిందితుడు. ఇంట్లో నిద్రిస్తున్న బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిని చూసి బాధితురాలి ఏడ్చి అసలు విషయం చెప్పేసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడిని అరెస్ట్​ చేశారు. సుమారు ఐదేళ్ల తర్వాత కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

మేనకోడలి హత్య..
ఇద్దరు పిల్లల మధ్య తరచూ గొడవ జరుగుతుందనే కోపంతో ఓ వ్యక్తి తన ఏడేళ్ల మేనకోడలిని గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని చెరువులో పడేశాడు. ఉత్తర్​ప్రదేశ్​లోని బలరాంపుర్​లో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షియా అనే బాలిక తన తల్లితో కలిసి రెండు నెలల క్రితం నోమ్‌కోని ప్రాంతంలోని తన మేనమామ కరణ్ సోని ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత రోజు సాయంత్రం షియా ఆడుకుంటూ హఠాత్తుగా కనిపించకుండా పోయింది. ఆ తర్వాత రోజు బాలగంజ్ సమీపంలోని చెరువులో ఆమె మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అనుమానంతో కరణ్​ను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. షియా ఆడుకుంటూ తన కుమార్తెను తరచూ కొట్టేదని.. అది తనకు కోపం తెప్పించేదని కరణ్​ విచారణలో పోలీసులకు చెప్పాడు. ఆరుబయట ఆడుకుంటున్న షియాను వాకింగ్‌కు తీసుకెళ్లి ఓ నిర్మానుష్య ప్రదేశంలో గొంతు కోసి హత్య చేశానని తెలిపాడు. అనంతరం మృతదేహాన్ని చెరువులో పడేసినట్లు పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.