దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. తమిళనాడులో రోజువారి కరోనా కేసులు 18వేల దిగువకు చేరుకున్నాయి. కొత్తగా 17,321 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 405 మంది మరణించారు. 31,253 మంది డిశ్చార్జ్ అయ్యారు.
దేశ రాజధాని దిల్లీలో కొత్తగా 337 కేసులు బయటపడ్డాయి. మరో 36 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు.
ఇతర రాష్ట్రాల్లో ఇలా..
- కేరళలో 16,204 కేసులు నమోదయ్యాయి. 156 మంది మృతి చెందారు.
- మహారాష్ట్రలో 10,989 మందికి కరోనా సోకింది. మరో 261 మంది మరణించారు.
- కర్ణాటకలో 10,959 కేసులు వెలుగుచూశాయి. 192 మంది మరణించారు.
- జమ్ముకశ్మీర్‌లో మరో 1,098 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 17 మంది మరణించారు.
- గుజరాత్లో 644 కేసులు నమోదవగా.. వైరస్ ధాటికి 11 మంది చనిపోయారు.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో 709 మంది కరోనా బారిన పడ్డారు. వైరస్‌తో 89 మంది కన్నుమూశారు.
- మధ్యప్రదేశ్‌లో కొత్తగా 453 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో 36 మంది మృతి చెందారు.