యాస్ తుపాను కారణంగా బంగాల్లో సుమారు కోటి మంది ప్రజలు బాధితులుగా మారారని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. మూడు లక్షల ఇళ్లు ధ్వంసం అయ్యాయని చెప్పారు. చేపలు పట్టడానికి వెళ్లిన ఓ వ్యక్తి మృతి చెందినట్లు వెల్లడించారు.
''యాస్ తుపాను ప్రభావం బంగాల్లో అత్యధికంగా ఉంది. ఇప్పటికే 15 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో త్వరలో ఏరియల్ సర్వే నిర్వహిస్తా.''
- మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
తుపాను కారణంగా.. తీర ప్రాంతంలో గంటకు 130-140 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి.
ఇదీ చదవండి: యాస్ తుపాను: పొంచి ఉన్న 'పున్నమి' గండం