ETV Bharat / bharat

రజనీకి సీఎం పరామర్శ- అభిమానుల ప్రత్యేక పూజలు - రజనీకాంత్​

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​.. ఆదివారం కావేరీ ఆసుపత్రికి వెళ్లి సూపర్​స్టార్​ రజనీకాంత్​ను పరామర్శించారు(rajinikanth health news). అస్వస్థత కారణంగా గురువారం ఆసుపత్రిలో చేరిన రజనీకి శుక్రవారం సర్జరీ అయ్యింది. మరోవైపు.. రజనీ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Stalin visits Rajinikanth in hospital
రజనీకాంత్​కు సీఎం పరామర్శ- ఆరోగ్యంపై ఆరా
author img

By

Published : Oct 31, 2021, 2:15 PM IST

Updated : Oct 31, 2021, 4:29 PM IST

చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సూపర్​స్టార్​ రజనీకాంత్​ను(rajinikanth health news) తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. రజనీకాంత్​ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

తలనొప్పి, అస్వస్థత కారణంగా రజనీ(Rajini Latest News)ను గురువారం ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం ఆయనకు సర్జరీ(కారోటిడ్ ఆర్టరీ రివాస్కులైజేషన్) జరిగింది. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. కొన్ని రోజుల అనంతరం రజనీ ఆసుపత్రి నుంచి విడుదల అవుతారని స్పష్టం చేశారు.

Stalin visits Rajinikanth in hospital
రజనీని పరామర్శించిన స్టాలిన్​

70ఏళ్ల రజనీకాంత్ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకునేందుకు కొన్ని రోజుల క్రితం దిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్​, ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులను కలిశారు. చెన్నైకి తిరిగొచ్చిన అనంతరం ఆసుపత్రిలో చేరారు.

Stalin visits Rajinikanth in hospital
ఆసుపత్రి వద్ద సీఎం కాన్వాయ్​

రజనీ కోలుకోవాలని ప్రత్యేక పూజలు

రజనీకాంత్​ కోలుకోవాలని అభిమానుల ప్రత్యేక పూజలు

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సూపర్​స్టార్​ రజనీకాంత్​ త్వరగా కోలుకోవాలని మధురైలోని తిరుపంకింద్రమ్​ మురుగన్​ ఆలయంలో ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే.. అన్నత్తే (పెద్దన్న) సినిమా పెద్ద హిట్టవ్వాలని భగవంతుడిని వేడుకున్నారు. స్వామివారికి 108 టెంకాయలు సమర్పించుకున్నారు. అనంతరం వరద పాశం (నేలపై ప్రసాదం తినటం) చేపట్టారు. 'అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మా సూపర్​ స్టార్​ గురించి తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చాం. ఆయన త్వరగా కోలుకోవాలని, రానున్న సినిమా విజయవంతం​​ కావాలని పెద్ద ఎత్తున ప్రార్థనలు చేశాం.' అని కుమారవేల్​ అనే అభిమాని తెలిపారు.

https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13510001_rajani1.jpg
ఆలయంలో అభిమానల ప్రత్యేక పూజలు
Rajinikanth in hospital
నేలపైనే ప్రసాదం తీసుకుంటున్న అభిమానులు
Rajinikanth in hospital
రజనీకాంత్​ కోలుకోవాలని అభిమానుల ప్రదర్శన

ఇదీ చూడండి:- ఆయన లేకపోవడం బాధగా ఉంది

Last Updated : Oct 31, 2021, 4:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.