ETV Bharat / bharat

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా రూ. 2వేలు జరిమానా - దిల్లీ: బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా రూ. 2వేలు జరిమానా

దిల్లీలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు నిబంధనలు మరింత కఠినతరం చేశారు అధికారులు. కొవిడ్ మార్గదర్శకాలు పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమయ్యారు. మాస్కు లేకపోతే రూ. 2వేల జరిమానాను ఇప్పటికే విధించగా.. తాజాగా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, పొగాకు వాడినా రూ.2వేల జరిమానాను వేయనున్నట్టు ప్రకటించింది దిల్లీ ప్రభుత్వం.

Spitting and tobacco consumption in public places to attract Rs 2,000 fine in Delhi
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా రూ. 2వేలు జరిమానా
author img

By

Published : Nov 21, 2020, 5:18 AM IST

దేశ రాజధానిలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో.. మహమ్మారి వ్యాప్తికి కళ్లెం వేసేందుకు కఠిన చర్యలు చేపట్టింది అక్కడి ప్రభుత్వం. మాస్క్‌ ధరించకుండా బయటకువచ్చిన వారికి రూ.2వేలు చొప్పున జరిమానా విధించాలని నిర్ణయించిన కేజ్రీవాల్‌ సర్కార్‌.. తాజాగా మరిన్ని కఠిన చర్యలను ప్రకటించింది. కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించేలా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, పొగాకు వాడినా, భౌతికదూరం పాటించకపోయినా రూ.2వేలు చొప్పున జరిమానా విధించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్‌ జారీచేసింది.

ప్రజల్లో భయం పెంచడానికి వీలుగా గతంలో రూ.500లుగా ఉన్న జరిమానాను రూ.2వేలకు పెంచింది ఆప్​ ప్రభుత్వం. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ ఆమోదం అనంతరం.. వైద్య ఆరోగ్యశాఖ ఈ నోటిఫికేషన్‌ను జారీచేసింది.

మరో 6వేలకుపైగా..

దిల్లీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 6,608 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 5.17లక్షలకు చేరింది. మరో 118 మరణాలతో.. మృతుల సంఖ్య 8,159కి పెరిగింది.

ఇదీ చదవండి: ఆ రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీ ఆడితే జైలుకే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.