ETV Bharat / bharat

Sperm Whale Vomit: తిమింగలం వాంతితో కోట్ల దందా- ముగ్గురు అరెస్టు

Sperm Whale Vomit: కర్ణాటక బెంగళూరులో రూ. 4 కోట్లు విలువ చేసే అంబర్​గ్రీస్​ను(తిమింగలం వాంతి) అధికారులు సీజ్​ చేశారు. ఈ పదార్థాన్ని తమిళనాడు నుంచి బెంగళూరుకు స్మగ్లింగ్ చేసిన ముఠాను అరెస్టు చేశారు.

whale
తిమింగలం
author img

By

Published : Dec 26, 2021, 5:18 AM IST

Sperm Whale Vomit: తమిళనాడు నుంచి కర్ణాటకకు గుట్టు చప్పుడు కాకుండా అంబర్​గ్రీస్​ను​(తిమింగలం వాంతి) తరలించిన ముఠాను అరెస్టు చేసింది బెంగళూరు సౌత్ ఈస్ట్​ పోలీస్ విభాగం. నిందితుల నుంచి రూ. 4 కోట్లు విలువ చేసే 4 కేజీల పదార్థాన్ని స్వాధీనం చేసుకుంది.

తమిళనాడుకు చెందిన పన్నీర్ సెల్వం, ఆనంద్ శేఖర్, కే. మంజు అంబర్​గ్రీస్​ స్మగ్లింగ్​ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. బెంగళూరు మైకో లే అవుట్ వద్ద నిందితులను పట్టుకున్నారు అధికారులు. నిందితులను అరెస్టు చేసి.. వారి కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు సౌత్​ ఈస్ట్ డీసీపీ శ్రీనాథ్ మహాదేవ్ జోషి తెలిపారు.

accused
ముగ్గురు నిందితులు
car
నిందితుల కారు స్వాధీనం

అంబర్ ​​గ్రీస్ అంటే..?

అంబర్ ​​గ్రీస్ పదార్థం సాధారణంగా తిమింగలం జీర్ణవ్యవస్థలో తయారవుతుంది. అది వాంతి చేసుకున్నప్పుడు, ఉమ్మినప్పుడు బయటకు వస్తుంది. సెంట్లు, పర్​ఫ్యూమ్​ల తయారీలో దీనిని వినియోగిస్తారు. ఒక్క కిలో అంబర్ ​​గ్రీస్​కు రూ.కోట్లలో ధర ఉంటుంది. ఇండోనేషియా, ఇంగ్లాండ్​లో ఈ పదార్థానికి విపరీతమైన డిమాండ్ ఉంది. అంబర్​ గ్రీస్​ను 1972 వన్యప్రాణుల చట్టం కింద నిషేధించారు.

ఇదీ చదవండి:

'డెత్​ వెల్'​లో బైక్​పై స్టంట్స్​- యువకుడికి తీవ్ర గాయాలు

ప్రియుడితో కలిసి భర్తను చంపి.. మృతదేహాన్ని డ్రమ్ములో దాచి..

NEET Suicide In Tamil Nadu: నీట్ పరీక్షలో ఫెయిల్- విద్యార్థిని ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.