ETV Bharat / bharat

ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు.. ఎందుకైందంటే.? - ప్రేమికుల దినోత్సవం వార్తలు

ప్రేమ ఓ మైకం. అందులో ప్రతిదీ అద్భుతమే! ఇక వాలెంటైన్స్ డే వచ్చిందంటే... ప్రేమికులకు పండగే. ఆ అనుభూతులు జీవితాంతం నిలిచిపోయే తియ్యని గుర్తులు. ఆ మధుర జ్ఞాపకాలు కలకాలం గుర్తుండే క్షణాలు. ఆ రోజు దక్కే ప్రేమకి అవధులుండవు! ఇంతకీ అసలు ఈ ప్రేమికుల రోజంటే ఏంటో తెలుసా? కలకాలం గుర్తుండిపోయే ఆ తియ్యని వేడుకను ఎందుకు జరుపుకొంటున్నారో తెలుసా...

WHERE DID VALENTINES DAY COME FROM
ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు.. ఎందుకైందంటే.?
author img

By

Published : Feb 14, 2021, 8:31 AM IST

ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల పండుగను యువతీయువకులు ఘనంగా జరుపుకొంటారు. ఇటీవల కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన వాలంటైన్​ వీక్​ వ్యాపారులకు బానే కలిసొచ్చింది. కొందరైతే తమ ఇష్టసఖులకు ప్రేమగా కానుకలిచ్చేందుకు ఎంత ఖర్చయినా వెనకాడట్లేదు. ఇన్నీ చేస్తున్నారు సరే... కానీ అసలీ ప్రేమికుల రోజు వెనకున్న చరిత్ర తెలుసా?

Valentine's Day
రోమ్ నగరంలో సెయింట్ వాలంటైన్

ఎవరీ వాలంటైన్​?

ప్రేమికుల దినోత్సవం చరిత్రపై చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. మూడో శతాబ్దంలో రెండో క్లాడియస్​ పాలించిన రోమ్ నగరంలో సెయింట్​ వాలంటైన్​ ఓ క్రైస్తవ ప్రవక్తగా ఉన్నట్లు చాలా మంది నమ్ముతారు. పురుషులు వివాహాలు చేసుకుంటే మంచి సైనికులు కాలేరనే భావనతో చక్రవర్తి.. తన రాజ్యంలో పెళ్లిళ్లను నిషేధించారు. ఇది నచ్చని వాలంటైన్... పురుషులకు రహస్యంగా పెళ్లి చేసేవారు.

ఈ విషయం తెలుసుకున్న క్లాడియస్.. వాలంటైన్​కు మరణశిక్ష విధించారు. అయితే శిక్ష కాలంలో జైలర్​ కుమార్తెను వాలంటైన్​ ప్రేమిస్తాడు. ఫిబ్రవరి 14న తాను చనిపోయే ముందే.. వాలంటైన్ తన ప్రియురాలికి ప్రేమ లేఖ పంపించాడు.

వాలంటైన్స్​ డే వెనకున్న కథేంటి?

ఫిబ్రవరి 14న వాలంటైన్ మరణించగా... అతని ప్రేమకు గుర్తుగా లూపర్​కాలియా పండుగను జరుపుకునేవారు. తమ ప్రేమని వ్యక్తం చేసేందుకు యువత సెయింట్​ వాలంటైన్ పేరు వాడటం మొదలు పెట్టారు. కాలక్రమేణా అది వాలంటైన్స్​ డేగా స్థిరపడింది.

Valentine's Day
వాలంటైన్స్​ డే వెనకున్న కథ

లూపర్​కాలియా అంటే..

ఫిబ్రవరి నెల మధ్యలో రోమన్​లు లూపర్​కాలియా అనే వేడుకను జరుపుకునేవారు. ఇందులో భాగంగా అమ్మాయిలు... తమ పేరు రాసి వాటిని ఓ డబ్బాలో వేసేవారు. తర్వాత అబ్బాయిలు తీసిన చీటీలో ఏ అమ్మాయి పేరు ఉంటే.. ఆమె అతనికి ప్రేయసి అవుతుంది. ఇలాంటి జంటలు కొన్నిసార్లు వివాహాలు చేసుకున్నారు. ఈ సంప్రదాయం నుంచే వాలంటైన్స్​ డే వచ్చినట్లు కొందరు బలంగా నమ్ముతారు.

LooperCalia Festival
లూపర్​కాలియా పండుగ

ఇదీ చదవండి: అవన్నీ లేకున్నా ప్రేమించిన వారితో ఆనందంగా గడపడింలా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.