మరికొద్ది రోజుల్లో రెండో బడ్జెట్ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వర్చువల్గా భేటీ అయింది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధినేత్రి సోనియాగాంధీ చర్చించారు.
పార్లమెంట్లో ప్రధానంగా వ్యవసాయ చట్టాలు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, పెట్రోల్ ధరలపై కేంద్రాన్ని నిలదీయాలని సమావేశంలో చర్చించారు. అంతేకాకుండా సామాజిక మాధ్యమాలపై కేంద్రం విధించిన నిబంధనల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ అసంతృప్త జీ-23 నాయకులు ఆనంద్ శర్మ, మనోజ్ తివారీ పాల్గొన్నారు. వారితో పాటు రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్షనేత, కొత్తగా ఎన్నికైన సభ్యులు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు.
ఇదీ చదవండి: దీదీ.. మీరు మారిపోయారు, ముందులా లేరు: మోదీ