కర్ణాటకలో కరోనా ఉద్ధృతికి ఈ దృశ్యాలు అద్దంపడుతున్నాయి. తన తల్లిదండ్రులను కాపాడుకోవడం కోసం.. ఓ కొడుకు పడే ఆరాటం సగటు మనిషిని కదిలిస్తున్నాయి.
ఇంట్లోని ఒక గదిలో కళ్ల ముందే తల్లి మృతదేహాన్ని పెట్టుకుని.. మరో గదిలో చావుబతుకుల మధ్య ఉన్న తండ్రినైనా కాపాడుకునేందుకు ఆ యువకుడు చేస్తున్న ప్రయత్నం హృదయవిదారకమనే చెప్పుకోవాలి. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
ఇదీ జరిగింది..
బెంగళూరు బీటీఎమ్ లేఅవుట్లో నివసిస్తున్న ఓ వ్యక్తి తన తల్లి తండ్రులను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు. కొవిడ్ సోకిన ఆయన తల్లితండ్రులకు.. ఆసుపత్రిలో పడక, ఆక్సిజన్ దొరకలేదని ఏకంగా ఇంటినే ఆస్పత్రిగా మార్చేశాడు.
ఇంట్లో ఆక్సిజన్ సిలిండర్ అమర్చి.. వైద్య సేవలు చేశాడు. అయితే.. ఆక్సిజన్ సిలిండర్ ఉన్నప్పటికీ సరైన రీతిలో వైద్యం అందక తల్లి మరణించింది..
అప్పటికే తండ్రి ఆరోగ్యం కూడా క్షీణించింది. దీంతో తండ్రినైనా కాపాడుకోవాలని ఆ యువకుడు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు.
ఇవీ చదవండి: