Soldier Killed in Manipur : మణిపుర్‌లో దారుణం జరిగింది. విధులకు సెలవులు పెట్టి ఇంటికి వచ్చిన ఓ ఆర్మీ జవాన్‌ను హత్య చేశారు కొందరు దుండగులు. దౌర్జనంగా ఇంట్లోకి చొరబడి జవాన్‌ను కిడ్నాప్ చేసి.. అనంతరం ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలో ఈ ఘటన జరిగింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మీ జవాన్, సెర్టో తంగ్తాంగ్ కోమ్(41).. జిల్లాలోని తరుంగ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. విధులకు సెలవులు పెట్టి ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం 10 గంటల సమయంలో గుర్తుతెలియని దుండగులు.. కోమ్ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. అనంతరం అతడ్ని దారుణంగా కొట్టి కిడ్నాప్ చేశారు. "ముగ్గురు వ్యక్తులు దౌర్జన్యంగా మా ఇంట్లోకి చొరబడ్డారు. వారిలో ఒక వ్యక్తి మా నాన్న తలపై గన్ గురిపెట్టి.. తెల్ల రంగు వాహనంలో బలవంతంగా ఎక్కించుకుని అపహరించుకుపోయాడు." అని సెర్టో తంగ్తాంగ్ కోమ్.. 10 ఏళ్ల కొడుకు వెల్లడించాడు.
ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు.. కోమ్‌ను వెతికే పనిలో పడ్డారు. ఎంతకీ అతని ఆచూకీ లభించలేదు. కానీ ఖునింగ్‌థెక్ గ్రామ పరిధిలో ఆదివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో జవాన్ కోమ్.. విగతజీవిగా పడి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. అతడి తలపై బుల్లెట్ గాయాలు ఉన్నాయని వారు వెల్లడించారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతామని వారు వెల్లడించారు. మృతుడు సెర్టో తంగ్తాంగ్ కోమ్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని పేర్కొన్నారు.
Manipur Firing : కొద్ది రోజుల క్రితం మణిపుర్‌లోని కాంగ్‌పోక్పై జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. గిరిజనుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న.. ఇరెంగ్, కరమ్ వైపేయి గ్రామాల మధ్య ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పులను గిరిజన ఐక్యత సొసైటీ తీవ్రంగా ఖండించింది. మణిపుర్‌లో శాంతిని పునరుద్ధరించే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉద్రిక్తతలు ఉన్న జిల్లాలన్నింటినీ వివాదాస్పద ప్రాంతాలుగా ప్రకటించాలని డిమాండ్ చేసింది. సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని కోరింది.
Manipur Violence : మణిపుర్‌లో మళ్లీ హింస.. ఎన్కౌంటర్లో 8మంది మృతి.. మరో 8మందికిపైగా..
'శాంతితోనే మణిపుర్ సమస్యకు పరిష్కారం.. ప్రస్తుతం అక్కడ మెరుగైన పరిస్థితులు'.. ఎర్రకోటపై మోదీ
Manipur Violence CBI : సీబీఐ చేతికి మరో 9 'మణిపుర్ అల్లర్ల' కేసులు.. మహిళా అధికారులను కూడా..