ETV Bharat / bharat

సామాజిక మాధ్యమాల్లో ప్రముఖమైనవి ఇవే

సోషల్​ మీడియాలో ప్రముఖమైనవి ఏవనే విషయాన్ని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రామాణికతను నిర్దేశించింది. 50 లక్షల మంది ఖాతాదారులున్న వాటిని ప్రముఖ సామాజిక మాధ్యమ వేదికలుగా గుర్తించనున్నట్టు వెల్లడించింది. అయితే.. పార్లమెంటు ఆమోదం లేకుండానే.. ప్రభుత్వం ఈ నిబంధనల్ని తీసుకొచ్చిందంటూ కాంగ్రెస్​ విమర్శించింది.

Social media account has 50 lakh users, it will be recognized as a one of the most popular account
సామాజిక మాధ్యమాల్లో ప్రముఖమైనవి ఇవే
author img

By

Published : Feb 28, 2021, 7:26 AM IST

సామాజిక మాధ్యమాల్లో ప్రముఖమైనవి ఏవన్న విషయం గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం ఓ ప్రామాణికతను నిర్దేశించింది. ఈ మేరకు 50 లక్షల మంది నమోదిత ఖాతాదారులున్న వాటిని ప్రముఖ సామాజిక మాధ్యమ వేదికలు(సిగ్నిఫికెంట్‌ సోషల్‌ మీడియా ఇంటర్మీడియరీస్‌)గా గుర్తించనున్నట్లు వెల్లడించింది. సామాజిక మాధ్యమాలు, ఓటీటీలకు కేంద్రం గురువారం(ఈ నెల 25న) కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ప్రముఖ సామాజిక మాధ్యమాలుగా గుర్తించిన వాటికి అదనపు నిబంధనలుంటాయని తెలిపింది. ఆ నిబంధనలేమిటో కూడా పేర్కొంది. తాజాగా ఏయే సామాజిక మాధ్యమాలను ప్రముఖమైనవిగా గుర్తించనుందో ఓ ప్రకటనలో తెలిపింది.

పార్లమెంటు ఆమోదం లేకుండానే కొత్త నిబంధనలా!: కాంగ్రెస్‌

పార్లమెంటు ఆమోదం లేకుండానే కేంద్ర ప్రభుత్వం సామాజిక మాధ్యమాలకు కొత్త నిబంధనలను తీసుకొచ్చిందని కాంగ్రెస్‌ విమర్శించింది. వీటిని 'చట్టబద్ధత లేని' మార్గదర్శకాలుగా వ్యాఖ్యానించింది. దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉన్న విస్తృత అధికారాలను ప్రభుత్వం అధికారులకు కట్టబెట్టిందని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతనిధి అభిషేక్‌ సింఘ్వీ ఆరోపించారు. దీనిపై ఇంతవరకు ఎలాంటి చట్టం తేలేదని, నాలుగేళ్లుగా కనీసం డేటా పరిరక్షణ చట్టాన్ని కూడా ఆమోదించలేదని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల నియంత్రణకు నిబంధనలు తీసుకొచ్చేటప్పుడు పార్లమెంటరీ పరిశీలన అవసరమన్నారు. సరైన కసరత్తు లేకుండా ఇలాంటి నిబంధనలు తీసుకొస్తే వాక్‌ స్వాతంత్య్రానికి, సృజనాత్మకతకు ప్రమాదకరంగా పరిణమిస్తుందని అభిప్రాయపడ్డారు.

అదేమీ కొత్త నిబంధన కాదు..

'అత్యవసర' సందర్భాల్లో ఇంటర్‌నెట్‌ సమాచారాం(కంటెంట్‌)ను నిలిపివేయడం కొత్త నిబంధనేమీ కాదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ శనివారం స్పష్టం చేసింది. 2009 నుంచే ఈ నిబంధన ఉన్నట్లు వివరించింది.

ఇదీ చదవండి: ఒకేసారి 3,229 పెళ్లిల్లతో ప్రపంచ రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.