ETV Bharat / bharat

గనిలో ప్రమాదం- ఆరుగురు కూలీలు మృతి - 6 assam labourers killed in Meghalaya mine

మేఘాలయాలోని ఓ గనిలో ఘోర ప్రమాదం జరిగింది. తవ్వకాలు జరుపుతుండగా ఆరుగురు కార్మికులు పెద్ద గుంతలో పడి మరణించారు. వీరంతా అసోం వాసులుగా గుర్తించారు.

Six Assam labourers die after falling into Meghalaya's mine
గనిలో ప్రమాదం- ఆరుగురు కార్మికులు మృతి
author img

By

Published : Jan 22, 2021, 5:09 PM IST

మేఘాలయలోని ఓ గనిలో జరిగిన ప్రమాదంలో అసోంకు చెందిన ఆరుగురు కార్మికులు మరణించారు. గనిలో ఏర్పడిన పెద్ద గుంతలో కూలీలు పడిపోయారని తూర్పు జంతియా హిల్స్ డిప్యూటీ కమిషనర్ కే ఖార్మాల్కి తెలిపారు. రైంబయి, సర్కారీ, డైన్షాలాలు గ్రామాల సమీపంలో గురువారం ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ విషయాన్ని మేఘాలయ ఐజీ గాబ్రియేల్ లాంగ్రాయి ధ్రువీకరించారు.

"గనిలో తవ్వకాలు జరుపుతుండగా అక్కడి యాంత్రిక నిర్మాణం కూలిపోయింది. దీంతో పెద్ద గుంతలో కార్మికులు పడిపోయారు. మొత్తం ఆరుగురు మరణించారు. ఐదుగురి వివరాలను గుర్తించాం. వీరంతా అసోం పరిసర ప్రాంతాలకు చెందినవారు."

-కే ఖార్మాల్కి, పోలీసు అధికారి

గని యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

2018 డిసెంబర్​లోనూ రాష్ట్రంలో ఇదే తరహా ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో 15 మంది మరణించారు.

ఇదీ చదవండి: పేడ కొనడం లేదని రోడ్​రోకో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.