ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో దిల్లీలో సమావేశమయ్యారు. మహారాష్ట్ర పుణెలోని పురందర్ వద్ద ప్రతిపాదించిన అంతర్జాతీయ విమానాశ్రయంపై చర్చించేందుకు రాజ్‌నాథ్‌ను కలిసినట్టు ట్వీట్ చేశారు పవార్. రక్షణ కార్యదర్శి, పౌర విమానయాన కార్యదర్శితోనూ ఈ విషయంపై చర్చించినట్టు వివరించారు. పనులు వేగవంతం చేయాలని కోరినట్టు స్పష్టం చేశారు.
అయితే... సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు ఉద్ధతంగా సాగుతున్న వేళ రాజ్‌నాథ్-పవార్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా పని చేసిన పవార్‌కు రైతు సంఘాల నేతలతో మంచి అనుబంధం ఉండడం ఇందుకు ఓ కారణం.
ఇదీ చూడండి:- సాగు చట్టాలపై రైతు సంఘాలకు కేంద్రం లేఖ