ETV Bharat / bharat

Sexual Harassment : బాయ్ ఫ్రెండ్ కోసం అప్పు చేస్తే... అదే అదనుగా..! - Sexual Harassment at Narayanaguda

Sexual Harassment at Narayanaguda : ఇన్‌స్టాలో మొదలైన స్నేహం.. ప్రేమగా మారి.. సాయం చేసేందుకు యత్నించి.. ఓ యువతి దారుణంగా మోసపోయింది. ప్రియుడి ఆర్థిక అవసరం తీర్చేందుకు.. మరో వ్యక్తిని నమ్మి నిండా మునిగిపోయింది. చివరకు లైంగిక వేధింపులకు గురై... షి-టీమ్స్‌ను ఆశ్రయించి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన హైదరాబాద్​లోని నారాయణగూడలో చోటుచేసుకుంది.

Sexual Harassment
Sexual Harassment
author img

By

Published : Jun 8, 2023, 4:49 PM IST

Updated : Jun 8, 2023, 7:09 PM IST

బాయ్ ఫ్రెండ్ కోసం అప్పు చేస్తే... అదే అదనుగా..!

Sexual Harassment Case in Hyderabad : సామాజిక మాధ్యామాల్లోని పరిచయాలు ఎక్కడికి దారి తీస్తున్నాయో ఇటీవల జరగుతున్న ఘటనలు చూస్తుంటే అర్థమవుతోంది. నిత్యం మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. తాజాగా నారాయణగూడ పరిధిలో జరిగిన ఘటన కలకలం రేపింది. ఇన్‌స్టాగ్రామ్​లో పరిచయమైన ప్రేమించిన వ్యక్తికి డబ్బులు సమకూర్చడం కోసం మరో వ్యక్తితో శారీరకంగా కలిసిందో యువతి.... సదరు వ్యక్తి కూడా ఆమెకు అదే సామాజిక మాధ్యమం ద్వారా పరిచయం అవడం గమనార్హం. ఇదంతా జరిగింది కేవలం రెండు వేల రూపాయల కోసమేనని తెలిసి పోలీసులే ఆశ్చర్యపోయారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని బొల్లారంకు చెందిన ఓ యువతి నారాయణగూడలోని ప్రైవేట్ హాస్టల్​లో ఉంటూ ఓ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో ఏడు నెలల క్రితం చెన్నై పుత్తూర్​లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్‌ ఫైనల్ ఇయర్ చదువుతున్న పూర్ణేష్ యాదవ్ అలియాస్‌ కాకుతో యువతికి పరిచయం ఏర్పడింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కాగా మే నెలలో తనకు కొంత డబ్బు కావాలని పూర్ణేష్ యువతిని అడిగాడు. దాంతో యువతి వద్ద డబ్బు లేక తనకు గతంలో ఇన్‌స్టాగ్రామ్ స్నేహితుడైన హైదరాబాద్​కు చెందిన అస్లాంను అడిగింది.

ఇదే అదునుగా భావించిన అస్లాం.... తన వద్ద డబ్బు లేదని తన స్నేహితుడు సాయి చరణ్ వద్ద ఉన్నాయని చెప్పాడు. అతన డబ్బు ఇవ్వాలంటే అతనితో శారీరకంగా కలవాలని చెప్పాడు. దీంతో పూర్ణేష్​కు డబ్బు ఇచ్చేందుకు సాయిచరణ్​తో గడిపేందుకు యువతి ఒప్పుకుంది. ఈ విషయం అస్లాంకు తెలిపింది. మే మొదటి వారంలో నారాయణగూడలోని ఓయో రూమ్‌ని బుక్ చేసిన అస్లాం ఇద్దరిని లోపలికి పంపాడు. అంతకంటే ముందే ఓ సెల్‌ఫోన్‌ కెమెరాను గదిలో పెట్టాడు. గదిలో ఇద్దరూ నగ్నంగా ఉన్న వీడీయోలు ఆ చరవాణి ద్వారా రికార్డ్ చేసిన అస్లాం వాటిని తన వద్ద ఉంచుకున్నాడు.

అనంతరం యువతి... పూర్ణేష్​కు రెండు వేల రూపాయలు గూగూల్‌ పే చేసింది. అవి సాయిచరణ్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. తన చరవాణిలో రికార్డ్‌ చేసిన వీడియోలను స్నాప్‌ చాట్‌ ద్వారా అస్లాం సదరు యువతికి పంపాడు. వీడియోలు చూసి ఖంగుతిన్న యువతి.. అస్లాంకు ఫోన్‌ చేసి ప్రాధేయ పడింది. వీడియోలు బయటకు వెళ్లకుండా ఉండాలంటే తన స్నేహితులతో శారీరకంగా గడపాలని అస్లాం బెదిరించాడు. ఈ విషయం జరగుతుండగానే కొద్దిరోజుల క్రితం యువతి ప్రియుడు పూర్ణేష్ హైదరాబాద్​కు వచ్చాడు. ఇద్దరూ కలిసిన రోజు యువతి చరవాణిని తీసుకున్న పూర్ణేష్ ఆ వీడియోలను గమనించాడు. వెంటనే ఆమెను నిలదీశాడు. ఇలా ఎందుకు చేశావని.. ఆ వీడియోలను యువతి బంధువులకు పంపతానని చెప్పడంతో ఆందోళనకు గురైన యువతి షీ బృందాలకు ఫిర్యాదు చేసింది.

'ఈనెల 3న ఓయువతి నారాయణగూడ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. తనను వేధిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొంది. తన వీడియోలు కుటుంబ సభ్యులకు పంపుతానని బెదిరిస్తున్నారని పేర్కొంది. ఇన్‌స్టాలో మొదలైన స్నేహం కాస్త ప్రేమగా మారింది. కొద్దిరోజుల క్రితం తనకు డబ్బు కావాలని ఆమెను అడిగాడు. డబ్బుల కోసం నగరానికి చెందిన మరో ఇన్‌స్టా స్నేహితుడిని ఆశ్రయించింది. డబ్బులు కావాలంటే తన మిత్రుడితో గడపాలని కోరిన యువకుడు. పథకం ప్రకారం రూమ్ బుక్ చేసి సెల్‌ఫోన్‌లో యువతి వీడియోలు రికార్డ్ చేశారు. ఆ వీడియో కుటుంబ సభ్యులకు పంపుతానని యువతిని భయపెట్టారు. షీ-టీం ద్వారా నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు కేసు బదిలీ. కేసు నమోదు చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నాం. మరో ఇద్దరి కోసం వెతుకుతున్నాం.'-శ్రీనివాస్‌, నారాయణగూడ ఇన్‌స్పెక్టర్‌

వెంటనే షీ టీమ్స్ ఈ కేసును నారాయణగూడ పోలీసులకు బదిలీ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు అస్లాంను అదుపులోకి తీసుకున్నారు. అతని ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే పూర్ణేష్, సాయిచరణ్​ను కూడా అదపులోకి తీసుకుని విచారిస్తామని నారాయణగూడ సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లోని పరిచయాలు ఎప్పటికైనా ప్రమాదమేనని.... ఇలాంటి వాటిపట్ల మహిళలు, యువతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇవీ చదవండి :

Last Updated : Jun 8, 2023, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.