ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో ఏడుగురు నక్సలైట్ల అరెస్టు

ఛత్తీస్​గఢ్​లో ఏడుగురు నక్సలైట్లను అరెస్టు చేశారు పోలీసులు. బీజాపుర్​ జిల్లాలోని రెండు గ్రామలలో వారిని పట్టుకుని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Seven Naxals held in Bijapur district of Chhattisgarh
ఏడుగురు నక్సలైట్ల అరెస్టు
author img

By

Published : Mar 9, 2021, 9:53 PM IST

ఛత్తీస్​గఢ్​ బీజాపుర్​ జిల్లాలో ఏడుగురు నక్సలైట్లను పోలీసులు అరెస్టు చేశారు. గంగుళూరు, బాసగూడ పోలీస్​స్టేషన్​ పరిధిలోని గ్రామల్లో వీరిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పలనార్​ గ్రామంలో విష్ణు తాటి, బార్సా మంగు అనే నక్సల్స్​ను మంగళవారం పట్టుకున్నట్లు తెలిపారు. పోలీసులను చంపడానికి వారిద్దరు కుట్ర పన్నినట్లు ఆరోపించారు. మోతీ తాటి, పక్లూ తాటి అనే నక్సల్స్​ను తోడ్కా గ్రామంలో అరెస్టు చేసినట్లు తెలిపారు. గతేడాది ఫిబ్రవరి, ఆగస్టు నెలల్లో భద్రతా దళాల పైదాడికి పాల్పడిన ఘటనకు వారికి సంబంధం ఉందని ఆరోపించారు.

బాసగుడలో సోమవారం అరెస్టైనవారు సోది, సురేశ్​ బార్సా, పోటమ్​ బుధ్​రామ్​గా గుర్తించినట్లు తెలిపారు. ఈ నక్సల్స్​ను అరెస్టు చేయడానికి జిల్లా భద్రతా బలగాలు, జిల్లా రిజర్వు గార్డ్స్​ పాల్గొన్నట్లు పోలీసులు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: 16మంది నక్సలైట్ల లొంగుబాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.