ETV Bharat / bharat

హైకోర్టుల్లోని టీకా కేసులన్నీ సుప్రీంకు బదిలీ

author img

By

Published : Mar 18, 2021, 1:11 PM IST

Updated : Mar 18, 2021, 1:51 PM IST

దిల్లీ, బాంబే హైకోర్టుల్లో కరోనా టీకాలకు సంబంధించిన కేసుల విచారణపై స్టే విధించింది సుప్రీం కోర్టు. ఆయా కేసులన్నింటినీ తనకు బదిలీ చేసుకుంది. సీరం ఇన్​స్టిట్యూట్​, భారత్​ బయోటెక్ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

supreme court
ఆ హైకోర్టుల్లో టీకా కేసుల విచారణపై సుప్రీం స్టే

కరోనా టీకాకు సంబంధించి దిల్లీ, బాంబే హైకోర్టుల్లో ఉన్న కేసుల విచారణపై స్టే విధించింది సుప్రీం కోర్టు. టీకా కేసులన్నీ సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ సీరం ఇన్​స్టిట్యూట్​, భారత్​ బయోటెక్​లు దాఖలు చేసిన పిటిషన్​పై కేంద్రంతో పాటు సంబంధిత పక్షాలకు నోటీసులు జారీ చేసింది.

ఈ పిటిషన్​పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డో నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. టీకా తయారీ సంస్థల అభ్యర్థన మేరకు.. హైకోర్టుల్లో పెండింగ్​లో ఉన్న టీకా కేసులన్నింటినీ తనకు బదిలీ చేసుకుంది సర్వోన్నత న్యాయస్థానం.

హైకోర్టులు సమాంతర విచారణ చేపడుతున్నాయని, ఎన్ని వ్యాక్సిన్లు తయారు చేస్తున్నారు, అందరికీ వ్యాక్సిన్లు ఎప్పుడు అందుతాయి వంటి సమచారాన్ని కోరుతున్నాయని టీకా తయారీ సంస్థలు కోర్టుకు తెలిపాయి. ఇలాంటి కీలకాంశాలన్నీ సుప్రీంలోనే విచారించాలని కోరాయి.

ఇదీ చూడండి: అత్యాచారం కేసులో 9మందికి జీవితఖైదు

Last Updated : Mar 18, 2021, 1:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.