ETV Bharat / bharat

'మహిళపై అత్యాచార కేసు నమోదు చేయొచ్చా? లేదా?' - పంజాబ్ మహిళ ముందస్తు బెయిల్ కేసులో సుప్రీం

SC On Woman Rape Case : అత్యాచార కేసుల్లో మహిళపై అభియోగాలు నమోదు చేయొచ్చా? లేదా అనే అంశాన్ని పరిశీలించనున్నట్లుగా సుప్రీంకోర్టు తెలిపింది. ఓ అత్యాచారం కేసులో మహిళ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ విషయాన్ని వెల్లడించింది.

SC On Woman Rape Case
SC On Woman Rape Case
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2023, 10:50 PM IST

SC On Woman Rape Case : అత్యాచార కేసుల్లో మహిళపై అభియోగాలు మోపచ్చా? లేదా? అనే అంశాన్ని తాము పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఓ మహిళ తన అత్తపై రేప్‌ కేసు పెట్టడం వల్ల ఈ అంశంపై న్యాయస్థానం దృష్టిపెట్టింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్​పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ విషయాన్ని తెలిపింది.

అత్యాచార కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఓ 61 ఏళ్ల మహిళ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం స్వీకరించింది. దీనిపై తమ స్పందనేంటో తెలియజేయాలని పంజాబ్ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. 'మహిళపై అత్యాచార కేసు నమోదు చేయొచ్చా? లేదా?' అనే అంశాన్ని తాము పరిశీలిస్తామని ఈ సందర్భంగా ధర్మాసనం వెల్లడించింది. అంతవరకు పిటిషన్‌దారుకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తున్నట్లుగా తెలిపింది. అయితే దర్యాప్తునకు సహకరించాలని పిటిషన్​దారును ఆదేశించింది.

కేసు వివరాలివే!
పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన 61 ఏళ్ల మహిళ గత ఏడాది సెప్టెంబరులో తన పెద్ద కుమారుడికి ఓ యువతితో వివాహం జరిపించింది. అప్పుడు ఆమె కుమారుడు అమెరికాలో ఉండడం వల్ల వర్చువల్‌గానే ఈ వివాహాన్ని నిర్వహించారు. ఆ తర్వాత నుంచి అత్తాకోడళ్లు ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. వివాహం జరిగిన తర్వాత కూడా స్వదేశానికి రాలేదు ఆమె పెద్ద కుమారుడు. ఆ తర్వాత కొంతకాలానికి మహిళ చిన్న కుమారుడు పోర్చుగల్‌ నుంచి వచ్చారు. కొన్ని రోజులు కుటుంబంతో ఉండి ఈ ఏడాది జనవరిలో తిరిగి వెళ్లిపోయాడు. అతడు వెళ్లిపోయిన కొన్నాళ్లకు ఆ కోడలు తన అత్త, ఆమె చిన్న కుమారుడిపై అత్యాచార కేసు పెట్టింది. అసభ్యకరమైన​ ఫొటోలు చూపించి అతడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆ విషయం బయటకు తెలియనివ్వవద్దంటూ తన అత్త బెదిరించిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. కోడలు ఫిర్యాదుపై ఆ మహిళ, ఆమె చిన్న కుమారుడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం సదరు మహిళ కింది కోర్టులను ఆశ్రయించింది. ఆమె పిటిషన్‌ను ఆ న్యాయస్థానాలు కొట్టేశాయి. దీంతో ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

'కుంటిసాకులు మాని.. ఏ చర్యలు తీసుకుంటారో తేల్చండి'

'ఆ విషయంలో రైతులను ఎందుకు విలన్లుగా చూపిస్తున్నారు'- ప్రభుత్వంపై సుప్రీం సీరియస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.