సొంత నియోజకవర్గం నుంచి దూరంగా ఉండే వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు కల్పించడంపై దాఖలైన పిటిషన్‌పై స్పందించాలని.. కేంద్రం, ఎన్నికల సంఘానికి నోటీసులు అందించింది సుప్రీంకోర్టు. ఎన్ఆర్ఐలకు కూడా దీనిని వర్తింపజేయడంపై స్పందించాలని స్పష్టం చేసింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఎ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ తరుపున వాదనలు వినిపిస్తూ న్యాయవాది కాళేశ్వరం రాజ్..ప్రస్తుతం కొద్ధి మందికే పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునే సౌకర్యం కలదని ధర్మాసనానికి విన్నవించారు. చాలాకాలంగా వలసవాదులు ఓటు హక్కుకు దూరమవుతున్నారన్నారు.
బయటి దేశాల్లో ఉన్న విద్యార్థులు, ఎన్ఆర్ఐలు, ఇంకా ఎన్నికల సమయంలో నియోజకవర్గానికి బయట ఉన్న వ్యక్తుల ఓటింగ్ హక్కులను కోరుతూ ఎస్. సత్యన్ దాఖలు చేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. తమ నియోజకవర్గం వెలుపల ఉన్న రిజిస్టర్డ్ ఓటర్లందరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం లేదా ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిట్ పోస్టల్ బ్యాలెట్ వ్యవస్థను విస్తరించాలని పిటిషన్లో కోరారు.
ఇదీ చదవండి:ఈసారి కుంభమేళా నెల రోజులే