ETV Bharat / bharat

అర్ణబ్​ మధ్యంతర బెయిల్ పొడిగింపు

రిపబ్లిక్​ టీవీ చీఫ్​ ఎడిటర్​ అర్ణబ్​ గోస్వామి మధ్యంతర బెయిల్​ గడువును సుప్రీం కోర్టు నాలుగు వారాలకు పొడిగించింది. క్రిమినల్​ చట్టం ఉన్నది వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని వేధించటానికి కాదని స్పష్టం చేసింది.

SC extends Arnab's interim bail, says criminal law not a weapon for selective harassment
అర్ణబ్​ మధ్యంతర బెయిల్​ను ​ పొడిగించిన సుప్రీం
author img

By

Published : Nov 27, 2020, 4:56 PM IST

రిపబ్లిక్​ టీవీ చీఫ్​ ఎడిటర్​ అర్ణబ్​ గోస్వామికి మరోసారి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అర్ణబ్​తో పాటు ఈ కేసులో నిందితులైన మరో ఇద్దరికి మధ్యంతర బెయిల్​ గడువును నాలుగు వారాలు పొడిగిస్తూ జస్టిస్ డీవై. చంద్రచూడ్​​, జస్టిస్ ఇందిరా బెనర్జీతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. క్రిమినల్​ చట్టం పేరుతో నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించవద్దని న్యాయస్థానం ఈ సందర్భంగా హితవు పలికింది. వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని వేధించటానికి క్రిమినల్​ చట్టం ఆయుధంగా మారకూడదని వ్యాఖ్యానించింది.

2018లో ఓ ఇంటీరియర్​ డిజైనర్​, అతని తల్లిని ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలతో అర్ణబ్​తోపాటు మరో ఇద్దరిని అలీబాగ్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. అర్ణబ్​ బెయిల్​ పిటిషన్​ను విచారించిన సుప్రీంకోర్టు నవంబరు 11న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

ఇదీ చదవండి:మధ్యంతర బెయిల్​తో తలోజా జైలు బయట అర్ణబ్​

ఇదీ చదవండి:'ఆత్మహత్య' కేసులో అర్నబ్ గోస్వామి అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.