ETV Bharat / bharat

'వివాదాల పరిష్కార కమిషన్‌లలోని ఖాళీలను భర్తీ చేయండి' - సుప్రీంకోర్టు

జిల్లా, రాష్ట్రస్థాయిలో వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లలోని ఖాళీలను భర్తీ చేయాలని మహారాష్ట్ర మినహా అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2022 జనవరి చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది.

Supreme court
సుప్రీం కోర్టు
author img

By

Published : Dec 7, 2021, 11:31 PM IST

జిల్లా, రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లలోని ఖాళీలను భర్తీ చేయాలని మహారాష్ట్ర మినహా అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2022 జనవరి చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది. జస్టిస్​ ఎస్‌కే కౌల్​, జస్టిస్ ఎంఎం సుందరేశ్​లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. చాలా రాష్ట్రాలు నియామక ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నట్లు చెబుతున్నాయని వ్యాఖ్యానించింది. 'జిల్లా, రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఛైర్మన్​, సభ్యులు/సిబ్బందిని నియమించడంలో ప్రభుత్వాల నిష్క్రియాత్మకత, దేశవ్యాప్తంగా తగిన మౌలిక సదుపాయాలు కొరత' అనే వ్యాజ్యాన్ని సుమోటోగా స్వీకరించి, విచారించింది సుప్రీంకోర్టు.

ఈ కేసులో తనకు సహకరించేందుకు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణ, న్యాయవాది ఆదిత్య నారాయణ్‌లను అమికస్ క్యూరీలుగా సుప్రీంకోర్టు నియమించింది. ఆదిత్య నారాయణ్​.. కమిషన్ సభ్యుల నియామకానికి సంబంధించి సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించారు. ఈ నివేదికను పరిశీలించిన న్యాయస్థానం.. "అమికస్ క్యూరీచే సూచించిన.. రెండు నెలల సమయం జిల్లా, రాష్ట్ర కమిషన్​ల​లో ఖాళీల భర్తీ ప్రక్రియను పూర్తి చేయడానికి సరిపోతుంది. అయితే కొన్ని కారణాల దృష్ట్యా మహారాష్ట్రకు మినహాయింపు ఇస్తున్నాం" అని ధర్మాసనం పేర్కొంది.

ఈ విచారణ సందర్భంగా.. వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో నియామకాల జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసింది అత్యున్నత ధర్మాసనం. ప్రభుత్వానికి ట్రిబ్యునళ్లు వద్దనుకుంటే వినియోగదారుల రక్షణ చట్టాన్ని రద్దు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. వినియోగదారుల హక్కులు కీలకమైనవిగా పేర్కొన్న ధర్మాసనం.. దేశవ్యాప్తంగా వినియోగదారుల కమిషన్‌లలో ఖాళీలు, మౌలిక సదుపాయాలు కొరత వల్ల పౌరుల ఫిర్యాదుల పరిష్కారాన్ని కోల్పోతారని జనవరిలో అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

ఇదీ చూడండి: ఎస్పీ-ఆర్​ఎల్​డీ పొత్తు ఖరారు- అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.