ETV Bharat / bharat

కొవిడ్ మార్గదర్శకాల ఉల్లంఘనపై సుప్రీం ఆందోళన - సోలిసిటర్ జనరల్

కొవిడ్​ మార్గదర్శకాలు ఉల్లంఘనపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నిబంధనలు కఠినంగా అమలుచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది.

SC
కొవిడ్ మార్గదర్శకాల ఉల్లంఘనపై సుప్రీం ఆవేదన
author img

By

Published : Dec 3, 2020, 5:05 PM IST

Updated : Dec 3, 2020, 6:08 PM IST

కొవిడ్-19 మార్గదర్శకాల ఉల్లంఘనపై సుప్రీం కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో భౌతికదూరం పాటించడం, మాస్కులు తప్పనిసరిగా ధరించడం వంటి నియమాలను నిక్కచ్ఛిగా అమలు చేసేందుకు కొన్ని సలహాలు ఇవ్వాలని సోలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతాను కోరింది.

కొవిడ్‌-19 రోగులకు హిమాచల్ ప్రదేశ్‌లో అందిస్తున్న వైద్యంపై కోర్టు ఆరా తీసింది. సమగ్ర వివరాలతో అఫిడవిట్​ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దృశ్యమాధ్యమ వేదికగా తీర్పు ఇచ్చిన ఉన్నత న్యాయస్థానం.. హిమాచల్​ ప్రభుత్వం.. కొవిడ్​ రోగులకు సరైన ఏర్పాట్లు చేయట్లేదని ఆగ్రహించింది.

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణపై కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా దిల్లీ, గుజరాత్​లలో పరిస్థితి అదుపుతప్పిన అంశాన్ని ప్రస్తావించింది. కరోనా రోగులకు మెరుగైన వైద్యం సహా వైరస్​తో మరణించిన వారి అంతిమ సంస్కారాలు గౌరవప్రదంగా నిర్వహించాల్సిన అంశాన్ని సుమోటాగా తీసుకొని విచారించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

ఇదీ చదవండి:ప్రభుత్వ భోజనం తినేందుకు రైతుల నిరాకరణ

Last Updated : Dec 3, 2020, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.