ETV Bharat / bharat

'పిల్లలు ఏడింటికే స్కూల్​కు వెళ్తుంటే.. మనమెందుకు రాలేం?': సుప్రీం జడ్జి - సుప్రీంకోర్టు టైమింగ్స్​

Justice Lalit: సుప్రీంకోర్టు కార్యకలాపాలు కాస్త ముందుగా ప్రారంభించడంపై స్పందించారు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్​ యూయూ లలిత్​. పిల్లలు ఉదయం 7 గంటలకే స్కూల్​కు వెళ్తుంటే.. మనమెందుకు కాస్త ముందుగా విచారణలు ప్రారంభించకూడదంటూ వ్యాఖ్యానించారు.

SC assembles early on Friday, Justice Lalit suggests courts should ideally sit at 9 am

author img

By

Published : Jul 15, 2022, 6:56 PM IST

Justice Lalit: చిన్నారులు ఉదయం ఏడు గంటలకే పాఠశాలలకు వెళ్తున్నప్పుడు.. మనమెందుకు కాస్తముందుగా పని ప్రారంభించకూడదంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ అభిప్రాయపడ్డారు. నిర్ణీత కాలానికంటే ముందే ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విధులు ప్రారంభించిన నేపథ్యంలో ఆయన్నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఆ ముగ్గురిలో ఈయన కూడా ఒకరు.

శుక్రవారం ఉదయం 9.30 గంటలకు జస్టిస్ లలిత్‌తో కూడిన ధర్మాసనం కేసు విచారణను ప్రారంభించింది. వాస్తవంగా కోర్టు పనిగంటలు 10.30కి ప్రారంభం అవుతాయి. ఇలా ముందుగా కార్యకలాపాలు ప్రారంభించడంపై అటార్నీ జనరల్‌ ముకుల్ రోహత్గీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ లలిత్‌ స్పందిస్తూ.. 'చిన్నారులు ఉదయం ఏడు గంటలకే పాఠశాలలకు వెళ్తున్నప్పుడు.. న్యాయమూర్తులు, న్యాయవాదులు ఎందుకు ఉదయం తొమ్మిది గంటలకు తమ పని ప్రారంభించలేరు..? కోర్టులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. సుదీర్ఘ విచారణలు అవసరం లేనప్పుడు ఉదయం తొమ్మిది గంటలకు మన పని ప్రారంభించి, పదకొండున్నర తర్వాత అరగంట విరామం తీసుకోవాలి. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు పని ముగించుకోవచ్చు. దీనివల్ల సాయంత్రం ఎన్నో పనులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.' అని అన్నారు.

సాధారణంగా వారంలో ఐదురోజుల పాటు కోర్టులు పనిచేస్తాయి. రోజు పని గంటలు ఉదయం పదిన్నరకు ప్రారంభమై సాయంత్రం నాలుగుకు ముగుస్తాయి. అందులో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి గంటపాటు లంచ్‌ బ్రేక్ ఉంటుంది. ఇక సీనియారిటీ ప్రకారం ఈ ఆగస్టు 27న జస్టిస్ యూయూ లలిత్ సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణ ఈ ఆగస్టులో పదవీ విరమణ పొందనున్నారు.

ఇవీ చూడండి: దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​.. హెచ్​సీయూ ర్యాంక్ ఎంతంటే...

కొడుకు పుడితే నరబలి ఇస్తానని మొక్కులు.. 18 ఏళ్ల యువకుడి హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.